Sunday, October 29, 2017

కుడి ఎడంగా అంతే కదా

ఆ స్వర్గానికి సరిసాటి ; 
ఈ పృధ్వీ తలము ;
కుడి ఎడమగ, ఔనమ్మా ;  ||
ఆలమందల మేపేను ; 
పచ్చిక బయలుల కిష్టయ్య ;  
ఆవులమందల మేపేను :  ||
;
ఆరుబయలుల పచ్చందనములు ; 
కన్నుదోయికి మేలు మేలు మేలు ;  
మేలైనట్టి షడ్రుచుల విందులు ; 
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము 
కుడి ఎడంగా, ఔనమ్మా ;  ||
;
ఉద్యానములలోన దోబూచి ఆటలు ; 
వనితల మేనుల సౌరభ వెల్లువలు ; 
పొదరింటి ప్రతి ఆకు, పువులు పొందేను ; 
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము 
కుడి ఎడంగా, ఔనమ్మా ;  ||
;
యమునలో క్రీడలు, రాసాటలు ; 
ఝరి నీరు పన్నీరు ఆయెనండీ ;
దివ్య సీమలకు సాటి ;
మన  భూ తలము ;
కుడి ఎడంగా, ఔనమ్మా ;  || 
;
=======================;
;
aa swargaaniki sarisaaTi ; 
ee pRdhwee talamu - 
kuDi eDamaga, aunammA :  || 
aalamamdala mEpEnu ; 
paccikabayalula kishTayya ;  
aawulamamdala mEpEnu ;  ||
;
aarubayalula paccamdanamulu ; 
kannudOyiki mElu mElu  mElu ;
mEainaTTi shaDrucula wimdulu ; 
aa swargammu sarisaaTi ; 
ee pRdhwee talamu - kuDi eDamaga, aunammA :  ||
;
udyaanamulalOna dObUci ATalu ; 
wanitala mEnula saurabha welluwalu ; 
podarimTi prati aaku, puwulu pomdEnu ; 
aa swargammu sarisaaTi ; 
ee pRdhwee talammu -  
kuDi eDamaga, aunammA :  ||
;
diwya seemalaku sATi ;
mana  bhuu talamu 
kuDi eDamaga, aunammA :  ||
;
yamunalO kreeDalu, raasaaTalu ;
jhari neeru panneeru aayenamDI ;
diwya seemalaku sATi ;
mana  bhuu talamu 
kuDi eDamaga, aunammA :  || 
;
; [ అఖిలవనిత.బ్లాగ్ ;  రాధా మనోహర ] ;

No comments:

Post a Comment