పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ;
అలకనంద కోపమును తీర్చును గోవిందుడు ;
;
పదే పదే అలుగుటలో ఆరితేరె రాధమ్మ ;
జరుగుబాటు ఉంటే ఆజ్ఞలు, ఆదేశాలు ;
ఛప్పన్నారు దేశాలలోన చలామణీ ఔతాయి ;
అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే : ||
;
చెలి చూపులలోన ;
కాయును ఎర్రని పగడాలు ; ;
ఎర్రెర్రని పగడాలు ;
కోపాలు, కినుకలు, అలుకలును ;
ఇంతటి విలువైనవి ;
|| అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే ||
;
తన నిరసనలు అమూల్యాలు ;
క్రిష్ణయ్యకు తెలుసెపుడో ;
అతివ రాధ అతిశయం - ఎంతో ముద్దు ;
అనునయాల విద్యలలో
నిపుణుడు, మన గోవిందుడు ;
||అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే! ||
;
అకారణం కోపం కోమలి రాధమ్మది ;
ఆ అభినయము, అనునయము ;
ఈ అభినయము, ఈ అనునయము ;
రసజ్ఞతా ప్రబంధము ; ;
కావ్య జగతికి ఆలంబనము, ఆలవాలము ;
|| అని తెలిసెను మనకు నేడు ;
అంతేలే, అది అంతేలే ||
;
;
======================;
;
padE padE aluguTalO aaritEre raadhamma ;
alakanamda kOpam ; teercunu gOwimduDu ; ||
;
padE padE aluguTalO aaritEre raadhamma ;
jarugubATu umTE ;aaj~nalu, aadESAlu ;
Cappannaaru dESAlalOna calAmaNI autAyi kadaa :
ani telisenu manaku nEDu
amtElE, adi amtElE : ||
;
celi cuupulalOna ; kaayunu errani pagaDAlu ; ;
errerrani pagaDAlu ;
kOpaalu kinukalu, alukalunu ; +
imtaTi wiluwainawi ;
||ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE ||
;
tana nirasanalu amuulyaalu ;
krishNayyaku telusepuDO ;
atiwa raadha atiSayam - emtO muddu ;
anunayaala widyalalO
nipuNuDu - mana gOwimduDu ;
|ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE ||
;
akaaraNam kOpam kOmali raadhammadi ;
aa abhinayamu, aa anunayam ;
ee abhinayamu, ee anunayamu ;
rasaj~nataa prabamdhamu ;
;
kaawya jagatiki ;
aalambanamu, aalawaalamu ;
||ani telisenu manaku nEDu ;
amtElE, adi amtElE ||
;
No comments:
Post a Comment