Sunday, October 29, 2017

కృష్ణునికి ఆచ్ఛాదనం

రేయికి చలి పుట్టె ;
చలి చలి ; వణికేను రాతిరి ;  ||
రాదిక విచ్చేసె భీతి వలదు ;
;
తన మేలిముసుగును
పరచి కప్పునులే ;
ఓ నిశీ! తన మేలిముసుగును
నీకు చుట్టేనులే ;  ||
;
'చలి చలి'  అంటూను కృష్ణుడు ;;
గడ గడా వణుకుతూంటేను ;
నటనల వణుకులు - చాలులే క్రిష్ణయ్య! ;
అని రమణీయముగ నవ్వె రమణీమణి ;  ||
;
భామామణి రాధిక లక్ష దరహాసాలు ;
నింగిలో విరిసిన - నక్షత్రమాలికలు ;
రాధ పరిష్వంగము ఆచ్ఛాదనం ;
క్రిష్ణునికి ఆచ్ఛాదనం ;  ||
;
==========================;
;
cali cali  ; amTUnu kRshNuDu ;;
gaDa gaDA waNukutuumTEnu ;
naTanala waNukulu -
caalulE krishNayya! ;
ani ramaNiiyamuga nawwe ramaNiimaNi  ;  ||
;
bhaamAmaNi raadhika nawwulu ;
nimgilO wirisina - nakshatramaalikalu ;
raadha parishwamgamu aacCaadanam ;
krishNuniki aacCaadanam ; ||
;

No comments:

Post a Comment