Sunday, October 29, 2017

పాల వెన్నెలకు అద్దిన రంగులు

జంటల లీలలు ; జాబిలి కంటను పడినాయి ; 
మింటను, జాబిల్లి కంటను - పడనే పడినాయి ;   || 
;
రజనీనాధుని కంటను పడనే పడినాయి ;   
రేరాజు కిలకిలా  ; రాకా చంద్రుడేల నవ్వుచుండె ; 
జాబిల్లి కంట పడిన మధు దృశ్యం - అది ఏమై ఉండును!???  ; 
;
కాముని పున్నమి రంగుల హేలల ;
పాల వెన్నెలకు అద్దుతు అతివలు ;
రాసక్రీడల హంగుల మేళా ;   || 
వనితల వలువలు వన్నెల చందము ;
చంద్రుని తెల్లని వెన్నెల సైతం ;
వర్ణభరితము ఆయెనులే ; 
మేలిముసుగుల అన్ని రంగులకు - 
దోబూచాటలు చాలా చాలా ; 
;
"చాలంటే అది ఒప్పదులే!
చాలని తనమే మేలిమి కళయై ;
చంద్రకళలకు సోయగమద్ది ;
మది మది నెమ్మది - రంగవల్లియై ;   || 
;
=========================;
;
jamTala leelalu jaabili kamTanu paDinaayi ; 
mimTanu - jaabilli kamTanu paDanE paDinaayi ; ||
;
rajaneenaadhuni kamTanu paDanE paDinaayi ;   
rEraaju kilakilaa ; raakaa camdruDEla nawwucumDe ;  
jaabilli kamTa paDina madhu dRSyam - adi Emai umDunu????? ; 
;
kaamuni punnami ramgula hEla ;
paala wennelalaku addutu atiwalu ;
raasakreeDala hamgula mELA :  ||
wanitala waluwalu wannela camdamu ;
camdruni tellani wennela saitam ;
warNabharitamu aayenulE ; 
mElimusugula anni ramgulaku - 
dObUcATalu caalaa caalaa ; 
;
"caalamTE adi oppadulE!
caalani tanamE mElimi kaLayai ;
camdrakaLalaku sOyagamaddi ;
madi madi nemmadi - ramgawalliyai ; ||
;

1 comment:

  1. మీ రచనలు బాగున్నాయి మా ప్రతిలిపికి పంపండి.వివరాలకు 7259511956 కాల్ చేయండి.

    ReplyDelete