జంటల లీలలు ; జాబిలి కంటను పడినాయి ;
మింటను, జాబిల్లి కంటను - పడనే పడినాయి ; ||
;
రజనీనాధుని కంటను పడనే పడినాయి ;
రేరాజు కిలకిలా ; రాకా చంద్రుడేల నవ్వుచుండె ;
జాబిల్లి కంట పడిన మధు దృశ్యం - అది ఏమై ఉండును!??? ;
;
కాముని పున్నమి రంగుల హేలల ;
పాల వెన్నెలకు అద్దుతు అతివలు ;
రాసక్రీడల హంగుల మేళా ; ||
;
వనితల వలువలు వన్నెల చందము ;
చంద్రుని తెల్లని వెన్నెల సైతం ;
వర్ణభరితము ఆయెనులే ;
మేలిముసుగుల అన్ని రంగులకు -
దోబూచాటలు చాలా చాలా ;
;
"చాలంటే అది ఒప్పదులే!
చాలని తనమే మేలిమి కళయై ;
చంద్రకళలకు సోయగమద్ది ;
మది మది నెమ్మది - రంగవల్లియై ; ||
;
=========================;
;
jamTala leelalu jaabili kamTanu paDinaayi ;
mimTanu - jaabilli kamTanu paDanE paDinaayi ; ||
;
rajaneenaadhuni kamTanu paDanE paDinaayi ;
rEraaju kilakilaa ; raakaa camdruDEla nawwucumDe ;
jaabilli kamTa paDina madhu dRSyam - adi Emai umDunu????? ;
;
kaamuni punnami ramgula hEla ;
paala wennelalaku addutu atiwalu ;
raasakreeDala hamgula mELA : ||
;
wanitala waluwalu wannela camdamu ;
camdruni tellani wennela saitam ;
warNabharitamu aayenulE ;
mElimusugula anni ramgulaku -
dObUcATalu caalaa caalaa ;
;
"caalamTE adi oppadulE!
caalani tanamE mElimi kaLayai ;
camdrakaLalaku sOyagamaddi ;
madi madi nemmadi - ramgawalliyai ; ||
;