ఉంగ ఉంగా అంటు ;
కాలి బొటనవ్రేలు ;
నోటిలో నుంచుకుని ;
చుక్ చుక్ మనుచు చీకుచున్నాడు ||
;
పెదవుల ఉరికేటి తెలి ఉమ్ము నురగల్లు ;
పాల్కడలి తరగల మీగడల బుడగల్లు ||
;
ముల్లోకముల నల్లు సూత్రాలు కదలికలు ;
ఆ - పదచలన సంగీత, నాట్యాల అల్లికల కలనేత ;
దోసెడంత ఆకు; కాదమ్మ కాదు!
చిటికెడంత ఆకు ; డోలికగ చాలంట!
నాల్గు వదనముల వేల్పు సృష్టించి ఇచ్చేను,
పెను కడలి జలములందున; విడిచేను నవ్వుతూ ||
;
ఆ మర్రి ఆకు, ఇపుడు
ఆదిశేషుని కన్న తాను మిన్న -
అనుచు పులకించేను;
శేషసాయికి పాన్పు వటపత్రమైన వేళలందు;
జగతికి కలుగును శాంతమ్ము రక్ష!
శ్రీరామరక్ష!;
================ ===============
# umga umgaa amTu ; kaali boTanawrElu ;
nOTilO numchukuni ; chuk chuk manuchu chIkuchunnADu ||
;
pedawula urikETi teli ummu nuragallu ;
paalkaDali taragala ; miigaDala buDagallu ||
mullOkamula nallu;
suutraalu kadalikalu ;
aa - padachalana samgiita,
naaTyaala ;
allikala kalanEta ;
;;
dOseDamta aaku; kaadamma kaadu! c
hiTikeDamta aaku ;
DOlikaga chaalamTa!
naalgu wadanamula wElpu ;
;
sRshTimchi; ichchEnu,
penu kaDali jalamulamduna;
wiDichEnu nawwutU ||
;
aa marri aaku, ipuDu
aadiSEshuni kanna
taanu minna - anuchu pulakimchEnu;
SEshasaayiki paan pu waTapatramaina wELalamdu;
jagatiki kalugunu SAmtammu raksha!
SrIraamaraksha!
;
దోసెడంత ఆకు; కాదమ్మ కాదు! చిటికెడంత ఆకు :- fb ;-
No comments:
Post a Comment