Friday, August 26, 2016

వాని వార్తలు

నోరైన మెదపకుండా కూర్చుంటి! 
ఊసైన చెప్పకుండా దాచేస్తి! 
చెవిని పోరైతే తప్పలేదు  ||నోరైన||  
చెలులు వెన్నంటి వార్తలు అడిగినపుడు; 
ఆ వెన్నుని వార్తలు – నన్నడిగినపుడు ;   ||నోరైన||
నీ చీర జలాతారంచు చెరగులందది ఏల? 
పాల తెలి మరకలయ్యే ననుచు ; 
చెలులు వైన వైనాలుగా అడిగినారు ||నోరైన||
;
పాలకడలికి నేను - పాల్కడలివాసుని : 
సేవింప వెడలిన సంగతిని వీరికి : 
చెప్పనే చెప్పను బుద్ధి!  బుద్ధి!!!  ||నోరైన||  
;
నెన్నుదుట కొంగ్రొత్త పద్మముల బొమ్మలు, 
శ్రీశంఖ చిహ్నలు ; ఎట్లొచ్చెననుచును – 
చెలులు, క్రిందు మీదెట్టుచూ అడిగినారు||నోరైన|| 
;
పద్మనాభుని చరణపద్మముల 
తల యొగి మ్రొక్కి వచ్చిన ; 
నాదు సౌభాగ్యములను 
తెలుపనే తెలుపను ; 
           సద్దు మరి చేయను 
              నోరైన మెదుపనంతే!  
;
► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼  ► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼   ► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼
;
waani waartalu [ pEjii 47 ;- SreekRshNa gItAlu ];-

nOraina medapakumDA kUrchumTi! 
Usaina cheppakumDA dAchEsti! 
chewini pOraitE tappalEdu  ||nOraina||  
chelulu wennamTi waartalu aDiginapuDu; 
aa wennuni waartalu – nannaDiginapuDu ;   ||nOraina||
nee cheera jalaataaramchu cheragulamdadi Ela? 
pAla teli marakalayyE nanuchu ; 
chelulu waina wainaalugaa aDiginAru ||nOraina||
;
paalakaDaliki nEnu - pAlkaDaliwAsuni :
sEwimpa weDalina samgatini wIriki : 
cheppanE cheppanu buddhi!  buddhi!!!  ||nOraina||  
;
nennuduTa komgrotta padmamula bommalu, 
SreeSamkha chihnalu ; eTlochchenanuchunu – 
chelulu, krimdu mIdeTTuchU aDiginAru||nOraina|| 
;
padmanaabhuni charaNapadmamula 
tala yoggi mrokki wachchina ; 
naadu sauBAgyamulanu 
telupanE telupanu ; 
              saddu mari chEyanu 
                    nOraina medupanamtE!    ||
;
[పేజీ 47 ; పాట 41 ]   [pEjii 47 ; paaTa 41 ] 

► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼  ► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼
వాని వార్తలు ;  శ్రీకృష్ణగీతాలు    - LINK

 ► ▼ ▼ ▼  ► ▼  ► ▼ ▼

No comments:

Post a Comment