పాలపుంతల సాగుచుండెడి ;
అప్సరసలు ;
దారి తప్పి వచ్చినారా!?
“కాదు! దారి తెలిసే వచ్చినారు ; ||
;
పాడి ఆవుల అంటి తిరిగెడు ;
లేగ దూడలు ఇవిగో!
మెరుపు దారములందు కట్టిన ;
చిన్నిముద్దు మబ్బుల ;
సొగసు పూవులు అవిగో! ; ||
;
“సొగసు సుందర లేమ! ;
ఇది వ్రేపల్లె సీమ!”
పల్లెసీమను చూచు కొరకు ;
అప్సరసలు వచ్చినారు,
దిగివచ్చినారు! ; ||
;
నోము, వ్రతముల సందండించే ;
ముద్దరాండ్ర తేట ఎడదల ;
కృష్ణ భావ – సరసులందున –
ఈదులాడే భాగ్యమ్ము
నొక్క క్షణమైనా ఇమ్మని ;
గోముగా అడిగేరు కన్నని ;
వియత్తలముల నుండి
వచ్చిన వనితలు - మరి
యక్ష, కిన్నెర భామినులు ||
► ► ► ► ► ► ► ►
;
; palleseemalu ;-
;
paalapumtala saaguchumDeDi ;
apsarasalu ;
daari tappi wachchinaaraa!?
“kaadu! daari telisE wachchinAru ; ||
pADi Awula amTi tirigeDu ;
lEga dUDalu iwigO!
; merupu daaramulamdu kaTTina ;
chinnimuddu mabbula ;
sogasu puuwulu awigO! ; ||
“sogasu sumdara lEma!
Idi wrEpalle seema!”
palleseemanu chuuchu koraku ;
apsarasalu wachchinaaru,
digiwachchinaaru! ; ||
;
nOmu, wratamula samdamDimchE ;
muddaraamDra tETa eDadala ;
kRshNa BAwa – sarasulamduna –
iidulADE BAgyammu
nokka kshaNamainaa immani ;
gOmugA aDigEru kannani ;
wiyattalamula numDi wachchina
wanitalu, mari -
yaksha, kinnera BAminulu ||
► ► ► ► ► ► ► ► ► ► ► ►
;
పల్లెసీమలు ;- [ పాట 31 - బుక్ పేజీ 41 శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment