రాధా మాధవ దేవులు ;
ఆడుచుండిరి బృందావనమున ;
రమ్యముగా అతి రమ్యముగా; ||రాధా||
;
హరిణాక్షి చేతి పావులతో ;
కంకణముల రవళి కూడ;
శృతిని కలిపెను ;
అను శృతిని కలిపెను; ||రాధా||
;
వనములోని హరిణమ్ములు ;
ఆట చూచి, మైమరిచి ;
రెప్ప వేయ మరచినవి ;
కనురెప్ప వేయ మరచినవి ; ||రాధా||
;
హరి, పొంకము మీరగా ;
వంగి వంగి , తానాడుచుండగా ;
నింగిలోని హరివిల్లు ; వంగి చూసెను ;
తాను వంగి చూసెను ; ||రాధా||
;
ధరణిలోని గిరులు ,
ఝరులు తరులు అన్నీ ;
పాట పాడాయి ;
'వంత పాట 'పాడాయి ; ||రాధా||
===============================,
ramyamugaa ashTAchamma ;-
raadhaa maadhawa dEwulu ;
ADuchumDiri bRmdAwanamuna ;
ramyamugaa ati ramyamugaa; ||raadhaa||
;
hariNAkshi chEti paawulatO ;
kamkaNamula rawaLi kUDa;
SRtini kalipenu ;
anu SRtini kalipenu;; ||raadhaa||
;
wanamulOni hariNammulu ;
ATa chUchi, maimarichi
; reppa wEya marachinawi ;
kanureppa wEya marachinawi ; ||raadhaa||
;
hari, pomkamu meeragaa ;
wamgi wamgi , taanaaDuchumDagA ;
nimgilOni hariwillu ; wamgi
chuusenu ; taanu wamgi chuusenu ;; ||raadhaa||
;
dharaNilOni girulu ,
jharulu tarulu annii ;
pATa pADAyi ;
'wamta pATa 'pADAyi ; ||raadhaa||
;
[ పాట 58 ; బుక్ పేజీ 63 , శ్రీకృష్ణగీతాలు ]
*******************************************************;
; రాధామనోహర ; ; raadhaamanOhara ;
No comments:
Post a Comment