వలసినదేమో తెలుపవిదేల? ;
కావలసినదేమో తెలుపవిదేల?
రాధిక వలపుల దోచిన రేడా!; ||వలసిన||
;
చందన మలిదేదా? శ్యామా!;
గంధము పూసేదా?
కుందమాలలను కూర్చితి లేరా ;
నీకై ముకుంద, మాధవ, గోవిందా! ||వలసిన||
;
ద్రాక్షా పాకము త్రాగుదువా?
మదన కదన కౌతూహల శౌరీ! ;
కదళీ ఫలముల గ్రోలుదువా? ; ||వలసిన||
;
నారికేళాములు కావలెనా?
"నారీ జన మన" సరసీ హంసా!
మరి, ఇక్షు రసములను గ్రోలుదువా? ; ||వలసిన||
;
తృణ రాడ్రసములు వరియించెదవా? ;
ఆర్త త్రాణ పరాయణ దేవా! ;
సురలోకపు సుధకై ;
గోముగ మారాము సేయుదువా? ; ||వలసిన||
మోహన మురళిని వలచుదువా! ;
యదు వంశీకృష్ణా!
మరి, రాధిక ,
అధరామృతమును వాంఛించెదవా?; ||వలసిన||
;
=======================;
raadhika walapulu ;-
walasinadEmO telupawidEla? ;
kaawalasinadEmO telupawidEla?
raadhika walapula dOchina rEDA!; ||walasina||
;
chamdana malidEdA? SyAmA!;
gamdhamu pUsEdA?
kumdamaalalanu kuurchiti lErA ;
neekai mukumda, maadhawa, gOwimdA! ||walasina||
;
draakshaa paakamu traaguduwA?
madana kadana kautuuhala SaurI! ;
kadaLI phalamula grOluduwA? ; ||walasina||
;
naarikELAmulu kaawalenA?
"naarI jana mana" sarasI hamsA!
mari, ikshu rasamulanu grOluduwaa? ; ||walasina||
;
tRNa rADrasamulu wariyimchedawaa? ;
aarta trANa parAyaNa dEwA! ;
suralOkapu sudhakai;
gOmuga maaraamu sEyuduwA? ; ||walasina||
;
mOhana muraLini walachuduwaa! ;
yadu wamSIkRshNA! mari, raadhika ,
adharaamRtamunu waamCimchedawaa?; ||walasina||
;
పాట ; బుక్ పేజీ , శ్రీకృష్ణగీతాలు పాట ; బుక్ పేజీ , శ్రీకృష్ణగీతాలు పాట ; బుక్ పేజీ , శ్రీకృష్ణగీతాలు ;-
రాధిక వలపులు ;- [పాట 54 ; బుక్ పేజీ 59 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment