Tuesday, August 23, 2016

చల్లని చూపులు

నోరు బుంగమూతి చుట్టి ; ; 
వేళ్ళు మడిచి, కాయ చుట్టి, 
‘పచ్చి' అంటు పలికేవు! అమ్మకచెల్లా!   ||
;
పాము చుట్టలందున పవ్వళించిన సొగసులా!? ; 
నీ మేనున  ఇవి కుబుస ముద్రలా!? ;
అనంతనాగుని కుబుస ముద్రలా!?   || 
;
అమ్మ లక్ష్మి వింజామర వీచుచుండగా ; 
మణి భూషణముల పొడులు ; 
నీ - దేహమునకు కవచములవ ;
అవి కుసుమ పరాగములా!? : -
అని అందరు విస్మయచకితులు అవగా || 
;
లోకాలను చుట్టిన, 
నీ చల్లని చూపులలోనే ; 
ఒడలెల్లా పొంగగా, నే పెడుదును ; 
దణ్ణాలు, వేల కోటి దండాలు!  
;
=================== ;
;
        challani chuupulu ; -   
;
nOru bumgamuuti chuTTi ; 
wELLu maDichi, kaaya chuTTi, 
‘pachchi' amTu palikEwu! ammakachellA!
;
; paamu chuTTalamduna pawwaLimcina sogasulaa!? ; 
nii mEnuna  iwi kubusa mudralaa!? ; 
anamtanaaguni     ||
;
amma lakshmi wimjaamara luupuchumDagaa ; 
maNi BUshaNamula poDulu ; 
nii dEhamuna kawachamulawa ; 
awi kusumaparaagamulaa!? : 
ani amdaru wismayachakitulu aguchumdagaa     ||
;
lOkaalanu chuTTina, 
nii callani cuupulalOnE ; 
oDalellA pomgagaa, 
nE peDudunu daNNAlu, 
wEla kOTi damDAlu! 
;
**************; 
[ పాట  33 - 34 - బుక్ పేజీ 34 ]:-     

No comments:

Post a Comment