Thursday, September 1, 2016

జీవన పల్లవి

బృందావన తరు పుష్పములార! 
కాళిందీ తరంగములారా! 
నే తెలిపే ఊసులు ; 
;       చెవి యొగ్గి వినండీ ; 
;        కాస్త చెవి యొగ్గి వినండీ  ;   ||బృందా||
;
వేణు వినోదీ మోవి సోకగనే ; 
నా "జీవన పల్లవి" పలికినదిటనే! :   ||బృందా|| 
;
"మదన సదన సామ్రాట్" బిగి కౌగిలిలో ; 
నా 'మానస కీరము' కులికినదిటనే! :   ||బృందా|| 
;
జలజ నయనుని వలపు వానలో ; 
సంతోష తరంగము త్రుళ్ళినదిటనే! :   ||బృందా|| 
;
పురాణ పురుషుని రాగబంధమున ; 
'ప్రేమ పికములు ' కూసిన విటనే!:   ||బృందా||   
;
============================= ===========;
jeewana pallawi ;- 
bRmdAwana taru pushpamulaara! 
kaaLimdI taramgamulArA! 
nE telipE Usulu ; 
chewi yoggi winamDI ; 
kaasta winamDI :   ||bRmdA||
;
wENu winOdii mOwi sOkaganE ; 
naa "jIwana pallawi" palikinadiTanE!:   ||bRmdA|| 
;
"madana sadana sAmraaT" bigi kaugililO ; 
naa 'maanasa kiiramu ' kulikinaiTanE!:   ||bRmdA|| 
;
jalaja nayanuni walapu waanalO ; 
samtOsha taramgamu truLLinadiTanE!:   ||bRmdA|| 
;
purANa purushuni rAgabamdhamuna ; 
'prEma pikamulu ' kuusina wiTanE!:   ||bRmdA||  
;
[ పాట 60 ; బుక్ పేజీ 65  , శ్రీకృష్ణగీతాలు ]

No comments:

Post a Comment