Friday, August 26, 2016

రాసకేళి

రాసవిహారీ కేళీ లోలా!
గోపీ జన మనోరంజనలీలా!   ||రాస||
;
నీదు నాసికాగ్రమున కులుకుచు నవ్వెడి ; 
స్వాతి ముత్యపు 'గరిమ ' ఎంతటిదో!! ;    ||రాస|| 
;
నీదు అంగుళీయకము నందున తళుకుల ; 
నీనెడు రాణ్మణి పుణ్యమెంతటిదో!  ||రాస|| 
;
నీదు పాణి పల్లవమ్ముల - డోలల నూగెడు ; 
వెదురు వేణువు సౌభాగ్య మెంతటిదో!  ||రాస|| 
;
నీదు పాదముల - ఒదుగు బాగ్యమును ; 
రాధిక కొసగిన నీ కారుణ్యమ్ము - 
                  ఎంత ఉన్నతమో!  ||రాస||  
;
============================================;

raasakELi :-
raasawihaarI kELii lOlA!
gOpii jana manOramjanalIlA!   ||raasa||
;
niidu naasikaagramuna kulukuchu nawweDi ; 
swaati mutyapu 'garima ' emtaTO! ||raasa|| 
;
niidu amguLIyakamu namduna taLukula ; 
niineDu rANmaNi puNyamemtaTidO!  
||raasa|| 
niidu paaNi pallawammula - DOlala nUgeDu ; 
weduru wENuwu sauBAgya memtaTidO!  ||raasa|| 
;
niidu paadamula - odugu baagyamunu ; 
raadhika kosagina nii kaaruNyammu - 
                             emta unnatamO!  ||raasa|| 

**************************************** 
 [ పాట 57 ; బుక్ పేజీ 62  , శ్రీకృష్ణగీతాలు ] 

{ పోలికలు :- వ్రజబాలుడు [ 12 పేజీ ] & రాగమయి [ పేజీ 54 ]:
=== { pOlikalu :- wrajabAluDu [ 12 pEjI ] & raagamayi [ pEjI 54 ]:

No comments:

Post a Comment