నీరజనాభా! భక్తవల్లభా! శ్రీనాధా!
లీలామానుష సూత్రధారీ!
ఏ రీతిని నే చేరుదు నీ దరి?
నీవే చూపవ దారి! ||లీలా||
;
నీరాజనముల జలకమాడుదువ?
నీరజనాభా! 'బాష్ప నీరాజనముల ' స్వీకరింతువా!?
తోమాలలను ధరియింతువ మెడలో! వనమాలీ!
వలపు తోమాలలను ధరియించుదువా? ||లీలా||
;
శ్రీ చందనములను అలదమందువా!
రాస విహారీ!హరి చందనములను అలదమందువా!
క్షీరాన్నములను భుజియించుదువా!?
క్షీరాంబుధిశయనా! ;
కేళీ క్షీరాన్నములను భుజియించుదువా!? ;||లీలా||
;
పత్ర పుష్పములు గైకొనెద ననుదువా!? ;
కమలలోచనా! ; ఫల తోయములే చాలునందువా!?;
ధూప దీప ఆరాధనలకే సంతసింతువా? నంద కిశోరా! ;
ఈ రాధా హృదయ తల్పమున శయనింతు నందువా!? ||లీలా|| ;
;
=================================,
;
neerajanaabhaa! bhaktawallabhaa! SrInaadhaa!
leelaamaanusha suutradhaarI!
E rItini nE chErudu
nI dari? neewE chuupawa dAri! ||leelaa||
;
neeraajanamula jalakamADuduwa?
neerajanaabhA! 'baashpa neeraajanamula'
sweekarimtuwA!? ;;;
tOmaalalanu dhariyimtuwa meDalO!
wanamAlI! walapu tOmaalalanu dhariyimchuduwaa? ||leelaa||
;
SrI chamdanamulanu aladamamduwA!
rAsa wihaarI!;hari chamdanamulanu aladamamduwA!
ksheeraannamulanu bhujiyimchuduwA!?
kshiiraambudhiSayanA! ;
kELI ksheeraannamulanu bhujiyimchuduwA!? ;||leelaa||
;
patra pushpamulu gaikoneda nanuduwA!? ;
kamalalOchanA! ; phala tOyamulE chAlunamduwaa!?;
dhuupa deepa aaraadhanalakE samtasimtuwA? namda kiSOrA! ;
ii raadhaa hRdaya talpamuna Sayanimtu namduwA!? ;||leelaa|| ;
;
; ] [పాట 56 ; బుక్ పేజీ 61 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment