చుట్టు చుట్టు తిరిగేవు,
అమ్మ చుట్టు తిరిగేవు ;
ఇట్టె మాయమయ్యేవు,
అమ్మక చెల్లా! ||
;
గోరు చుట్టు మొలిచెనంటు ;
దొంగ వేషాలు వేసి ;
నోరు తెరచి విశ్వమంత - చూపు
సంభ్రమాల లీల లేల? ||
;
వింతలెన్ని చూపినా
అమ్మ వద్ద, క్రిష్ణయ్యా! ;
చిన్ని బాలుడివే లేరా!
;
అమ్మ చేతి గోరుముద్ద,
నీదు – చిన్ని బొజ్జలోన ;
“శ్రీరామరక్ష”యే లేరా! ||
;
==============================,
# Sriiraamaraksha ;-
;
chuTTu ; chuTTu tirigEwu,
amma chuTTu tirigEwu ;
iTTe maayamayyEwu,
ammaka chellaa! ||
;
gOru chuTTu molichenamTu ;
dogma wEshaalu wEsi ;
nOru terachi wiSwamamta - chuupu
sambhramaala liila lEla? ||
;
wimtalenni chuupinaa
amma wadda, krishNayyaa! ;
chinni baaluDiwE lErA!
;
amma chEti gOrumudda,
niidu – chini bojjalOna ;
“Sriiraamaraksha”yE, lEraa ||
;
[ పాట 35 - బుక్ పేజీ 35 ]
No comments:
Post a Comment