రహస్యాలు తెలుపమని ;
అణకువతో క్రిష్ణమ్మను ;
ముక్తాఫల మడిగేను ; ||
;
ప్రార్ధనతో మౌక్తికము ;
డస్సి పోయినది చాలా ;
:
నీ నుదుట నుండి
జారుతున్న "చెమట బొట్టు"ను ;
శరణు వేడెను ;
ఆణి ముత్యం శరణు వేడెను ; ||
;
అంత'అందం బొట్టు తనమును' ;
తాను ఎటుల పొందగలనని ;
ఆ కిటుకు చెప్పమన్నది ;
ఆ గుట్టు కాస్త నుడువమనెను ; ||
;
చక్కని ఆ ఊసును ;
చక చక్కని మర్మమును ;
చెప్పమంటూ వేడుకుంటూ ;
నీ హొంబట్టు చేలాంచలము పట్టి ;
శరణు వేడెను మరి మరీ ; ||
;
అణకువతో క్రిష్ణమ్మను ;
ముక్తాఫల మడిగేను ; ||
;
ప్రార్ధనతో మౌక్తికము ;
డస్సి పోయినది చాలా ;
:
నీ నుదుట నుండి
జారుతున్న "చెమట బొట్టు"ను ;
శరణు వేడెను ;
ఆణి ముత్యం శరణు వేడెను ; ||
;
అంత'అందం బొట్టు తనమును' ;
తాను ఎటుల పొందగలనని ;
ఆ కిటుకు చెప్పమన్నది ;
ఆ గుట్టు కాస్త నుడువమనెను ; ||
;
చక్కని ఆ ఊసును ;
చక చక్కని మర్మమును ;
చెప్పమంటూ వేడుకుంటూ ;
నీ హొంబట్టు చేలాంచలము పట్టి ;
శరణు వేడెను మరి మరీ ; ||
;
No comments:
Post a Comment