Monday, July 30, 2018

యమున నీట కొత్త ముగ్గులు

వింత  వింత ముగ్గులు ; వింత కొత్త ముగ్గులు ; 
యమున నీలి నీటి పైన ; చిత్రించిన క్రిష్ణ లీల ; 
చిత్రంగా చిత్రించిన క్రిష్ణ లీల ;  || 
;
ఒకరిపైన ఒకరు ;  పరస్పరం పరిహాసం ; మోదముల తపతపలు ;
మిన్ను ముట్టె నీటి జల్లు ; ........ నీళ్ళు నీళ్ళు జల్లులు ;
మిన్ను ముట్టె కేరింతలు ; ........ కిలకిలల కేరింతలు ;
ప్రకృతి నిలువెల్ల ; పులకింతల ఝల్లుమనె ;  ||  
;
భామినులు జలములందు ; 
గుండ్రంగా తిరిగేరు ;
'రాసక్రీడ' - ముద్దు ; 
'రాసలీల' - ముగ్గు ;
వర్తులముల ఆట ; 
వలయాల వెలసేను ; 
వింత కొత్త ముగ్గులు ; 
సూర్య కాంతి, చంద్ర జ్యోత్స్న ; 
జల గీతల మెరసెను ; 
లయల హొయల మెరసేను ;  ||  

No comments:

Post a Comment