Tuesday, July 31, 2018

దాగుడుమూత దండాకోర్

దాగుడుమూత, దండాకోర్ ; 
దాగుడుమూతలు, దోబూచి ; ||
;
గుట్టుగ ఒదిగి, ఎంచక్కా ; 
నక్కి నక్కి పొంచి చూస్తుండే ఆటల మేటి ;
అల్లరి పిల్లడు, ఇట్టే పట్టుకుందమా ;
తుంటరి క్రిష్ణుని ; నీల మణిని, 
మన మరకత క్రిష్ణయ్యని ; ||

అట్టే ఉన్నాడంటే ; 
ఇట అట ఇట ;
అటు ఇటు నటు ; 
నిగూఢముగ ఉన్న వాడు ; 
నటనాల క్రిష్ణుడే - అని ;
అంటావా, అంటున్నావా!? ; || 
;
అట్టే బొమ్మల్లే నిలిచి ; 
మనకు భ్రమలు కల్పిస్తాడు ; 
శిల్పమల్లె నిలుచుండి ; 
కనుమాయలు కల్పించి ; 
చటుకున ఎటనో 
మటుమాయం ఔతున్నాడిట్లా ; || 
;
అటు ఇటు నటు ; 
నటనాల క్రిష్ణుడటనే ...... 
ఔరా! ఆ పెను మాయ, 
మర్మ మెటుల తెలిసేది 
ఈ పట్టున తటాలున ; 
చెప్పగలవ, మిత్రమా! ; ||

No comments:

Post a Comment