Monday, July 30, 2018

కస్తూరి అగరుల లేపనములు

చెన్నకేశవుని మేన మైపూత పూయండి ;
సుగంధ ద్రవ్య సమ్మేళనమ్ములను ;
రంగనాధునికి - మన శ్రీరంగనాధునికి ;  || 
;
కస్తూరి అగరుల లేపనములలమండి ;
ఓ లలనలారా, లాలిత్య లాలనగ - 
కస్తూరి రంగనికి - మన కావేరి రంగనికి ;  || 
;
చెంగల్వ కోష్టమ్ము కడిని పూయండి ; 
చిలిపి తనముల బంగారు చెలులార ; 
చెలువముగ పూయండి ;
చెంగలువ రేకుల ముద్దను ; 
చెన్నకేశవునికి - మేన చెన్నకేశవునికి ;
;
కావేరి రంగడు, మన శ్రీరంగశాయి ;
చెలువార చనువుగా స్నానాలు చేయగా ;
నది నీట  పునుగు, జవ్వాది ;
ద్రవ్యాల పరిమళము వ్యాపింప .......  ;
కావేరి నది నీట పరిమళము వ్యాపించగా ; 
మదను ధనువున - పువులు వికసించును ;  || 
=====================; ;
;
cennakESawuni mEna maipuuta puuyamDi ;
sugamdha drawya sammELanammulanu ;
ramganaadhuniki - mana Sreeramganaadhuniki ;  || 
;
kastuuri agarula - lEpanamulalamamDi ;
O lalanalaaraa, laalitya laalanaga - 
kastuuri ramganiki - mana kaawEri ramganiki ;  || 
;
cemgalwa kOshTammu kaDini pUyamDi ; 
cilipi tanamula bamgaaru celulaara ; 
celuwamuga pUyamDi ;
cemgaluwa rEkula muddanu ; 
cennakESawuniki - mEna cennakESawuniki ;
;
kaawEri ramgaDu, mana SreeramgaSAyi ;
celuwaara canuwugaa - snaanaalu cEyagaa ;
nadi neeTa  punugu, jawwaadi ;
drawyaala parimaLamu wyaapimpa .......  ;
kaawEri nadi neeTa parimaLamu wyaapimcagaa ; 
madanu dhanuwuna - puwulu wikasimcunu ;  || 
;

No comments:

Post a Comment