Monday, July 30, 2018

కృష్ణ పదములు - ఉయ్యాల గొలుసులు

మా ఎడదల డోలలివే ;
ఉయ్యాలలు ఊగుమోయి ;
నటన సూత్రధారీ క్రిష్ణయ్యా ; ||
;
పెదవులపై పదములు ;  
డోల త్రాళ్ళు ఆయెను ;
పద సంపద చేరి చేరి ; 
కృష్ణాకృతి ఆయెను ; 
నవ్య కృష్ణ కృతులు ఆయెను ; ||
;
చిన్ని చిన్ని తేనెల - 
పలుకులన్ని ఇవియే కద ;
మధువు మాట కావ్యాలై ;
నడచు క్రిష్ణ పధమున ; ||
;
నెలవంక డోల నీకు ;
అమరిస్తిని కన్నయ్యా ;
నాదు పదము కీర్తనలు ;
అందు మెత్త పరుపులు ; ||
;
యశోదమ్మ "అయ్యారే" 
అనుచు, సంభ్రమించునటుల ; 
ఉయ్యాలలు ఊగుమోయి ;
;
మా ఎడదల డోలలివే ;
ఉయ్యాలలు ఊగుమోయి ;
నటన సూత్రధారీ క్రిష్ణయ్యా ; || 

pedawulapai padamulu ;  
DOla traaLLu aayenu ;
pada sampada cEri cEri ; 
kRshNaakRti aayenu ; ;
nawya kRshNa kRtulu aayenu ; ||
;
cinni cinni tEnela - 
palukulanni iwiyE kada ;
madhuwu maaTa kaawyaalai ;
naDacu krishNa padhamuna ; ||
;
nelawamka DOla neeku ;
amaristini kannayyaa ;
naadu padamu keertanalu ;
amdu metta oarupulu ;
yaSOdamma "ayyArE" anucu ;
sambhramimcunaTula ; 
uyyaalalu uugumOyi ;
maa eDadala DOlaliwE ;
naTana suutradhaaree ; 

No comments:

Post a Comment