Monday, July 30, 2018

విశ్వమంత వ్రేపల్లె

చెమ్మ చెక్క చెమ్మ చెక్క  ; 
అతివలందరి ఆట ఇట ; 
యమున ఒడ్డు వేదికంట ;; 
ఆ కంట ఈ కంట ; 
రాధిక వెదజల్లిన పూ తావియట ;
అట -
వెదజల్లిన పువుల మధుతావి ;  || 

లేమల లేచేతులందు ; 
లేత తమలపాకు ;
లేత తమలపాకులందు పోక చెక్కలు ; 
సున్నమెక్కువైనదంట ; 
ముద్ద వెన్న - అక్కర ఇట ; 
ముద్దు ముద్దు - 
ముద్ద వెన్న - అక్కర ఇట ;  ||
;
రమణీ వర్తులముల రాసలీలలు,  
కోటి రాసలీల కోటలిటను ; 
గగనములను ముట్టినవట ; 
వ్రేపల్లెలోన ఇంటింటా ; 
క్రిష్ణ రాధ గాధలే ; 
విపుల విశ్వమిప్పుడు 
రేపల్లెగ ఆయెనంట ;  || 

=====================; ;

cemma cekka cemma cekka  ; 
atiwalamdari ATa iTa ; 
yamuna oDDu wEdikamTa ;; 
aa kamTa ee kamTa ; 
raadhika wedajallina puu taawiyaTa ;
aTa -
wedajallina puwula madhutaawi ;  || 

lEmala lEcEtulamdu ; 
lEta tamalapaaku ;
lEta tamalapaakulamdu pOka cekkalu ; 
sunnamekkuwainadamTa ; 
mudda wenna - akkara iTa ; 
muddu muddu - 
mudda wenna - akkara iTa ;  ||
;
ramaNI wartulamula raasaleelalu,  
kOTi raasaleela kOTaliTanu ; 
gaganamulanu muTTinawaTa ; 
wrEpallelOna imTimTA ; 
krishNa raadha gaadhalE ; 
wipula wiSwamippuDu 
rEpallega aayenamTa ;  || 
;
- wiSwamamta wrEpalle ;

No comments:

Post a Comment