Tuesday, July 31, 2018

కృష్ణలీలలకు తూనిక రాళ్ళు

క్రిష్ణ లీలలను తూచే ;
తులాభారమందుంచే ;
తూకం రాళ్ళు ;
ఇవి తూనిక రాళ్ళు కాబోలు ;  ||
;
నిలువు నామము, 
ఊర్ధ్వ పుండ్రం ; 
దోస గింజ బొట్టునా, 
ఏది పెట్టమందువయ్య, క్రిష్ణా ;  ||

చిట్టి బొట్టు, చినుకు బొట్టు ; కమ్మనైన కస్తూరి బొట్టు ; 
ఈ తూరి ఏమి బొట్టు పెట్టమందువు!? త్వరగ చెప్పుము ; 
త్వరితముగా చెప్పవయ్యా ; బెట్టు చేయక చిన్ని క్రిష్ణా ;  ||
;
ఉంగరమ్ము వేలు తోటి పెట్టమన్నావు ; 
కాదు, కాదు - చూపుడేలును చూపమనంటివి ; 
వద్దు వద్దని, ముద్దుగాను ; 
చిన్ని వేలుతొ పెట్టమందువు ; 
ఔర క్రిష్ణా, ఇంత అల్లరి ;  ||
;
=============; ; 
;
krishNa leelalanu tUcE ; 
tulaabhaaramamdumcE ; 
tuukam raaLLu  ;
iwi tuunika raaLLu kaabOlu ;  ||
;
niluwu naamamu ;
uurdhwa pumDram ; 
dOsa gimja boTTunaa, 
Edi peTTamamduwayya, krishNA ;  ||
;
ciTTi boTTu, cinuku boTTu ; 
kammanaina kastuuri boTTu ; 
ee tuuri Emi boTTu peTTamamduwu!? 
twaraga ceppumu ; 
twaritamugaa ceppawayyaa ;
beTTu cEyaka cinni krishNA ;  || 
;
umgarammu wElu tOTi peTTamannAwu ; 
kaadu, kaadu - cuupuDElunu cuupamanmTiwi ; 
waddu waddani, muddugaanu ; 
cinni wEluto peTTamamduwu ; 
aura krishNA, imta allari ; 

No comments:

Post a Comment