జనని లాలి పాటలు ;
మాత జోల పాటలు ;
క్రిష్ణయ్యా!! నిన్నెన్నో విద్యలలో ;
నేర్పుమంతుడిగ చేసెను ;
ఒప్పుకుంటావా!?
మరి, కాదని తప్పుకుంటావా!? ; ||
;
అనగనగా కథలు చాల ;
వాజి పయిన వీరుడు ;
బుల్లి రాజ కుమారుడు ;
అగణితమౌ కల్పనలు,
నీదు స్వప్న పల్లకీలు ;
మోసుకొచ్చు పరిమళాల పుష్పాలు ||
;
యశోద మాత కథల
సాధు స్వాదు మృదు వీణా రాగములు ;
ఆ రాగములను ;
నీ వేణువు పొదువుకొనును నిరంతరం ;
ఆ భావమ్ముల సొబగులను
నీ హృదయం హత్తుకొనును సదా! :
మురళీధరుడవు నీవు ;
;
అన్న యశసు పునాదులకు ;
అమ్మ లాలి పాటలే! క్రిష్ణయ్యా!
ఔనా మరి, ఒప్పుకొందువా నీవు -
కమ్మనైన ఈ నిజం ;
ఇంత కమ్మనైన ఈ నిజం ;
======================;
janani pADu jOlalu ; shNayyA!
anaganagaa kathalu chaala ;
waaji payina weeruDu ;
bulli raaja kumaaruDu ;
agaNitamau kalpanalu,
needuswapna pallakiilu ; ||
;
nee wENuwu poduwukonunu ;
yaSOda maata kathaa
weeNa raagamulanu ;
muraLIdharuDawu neewu ;
anna yaSasu punaadulaku ;
amma laali pATalE! krishNayyA!
aunaa mari, oppukomduwaa neewu -
kammanaina ii nijam ;
imta kammanaina ii nijam ; ||
;
[ పాట 78 ; బుక్ పేజీ 83 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment