Friday, November 4, 2016

లీలా వినోది

ఏమమ్మా! ఓ గున్న మామిడీ!
ఎందులకే నీకింత గర్వము!
ఏలనె? ఏలనె? ఇంత సందడి? :   ||

నన్నే అల్లిన మాధవీ లతల ;
నూయల లూగిరి రాధాకృష్ణులు ;
నాదు భాగ్యము, పూర్వ సుకృతము ;
పరమానందుడు తాకిన పుణ్యము ;
అందులకే నాకీ గర్వము ;
అందులకే సుంత అహం! :   ||

నా - కొమ్మలలోన దాగిన 'కొమ్మల ' ;
"అమ్మక చెల్లా! చిక్కితి" రనుచును
కొమ్మల నెక్కి; ఆకు గుబురుల నక్కి
లలనల నిట్టే పట్టిన లీలా వినోదు ;
తనువు సోకిన నెంతో ముదము ;
చిన్మయ రూపుని - మోసిన మోదము ;
బహు గీర్వాణము , అందుకనే! అందుకనే! :   ||

============================;

                  leelaa winOdi ;-

EmammA! O gunna mAmiDI!
emdulakE nIkimta garwamu!
Elane? Elane? imta samdaDi? :   ||

nannE allina maadhawI latala ;
nuuyala luugiri raadhaakRshNulu ;
naadu BAgyamu, puurwa sukRtamu ;
paramaanamduDu tAkina puNyamu ;
amdulakE naakii garwamu ;
amdulakE sumta aham! :   ||

naa - kommalalOna daagina 'kommala ' ;
"ammaka chellA! chikkiti" ranuchunu ;
kommala nekki ; aaku guburula nakki ;
lalanala niTTE paTTina leelA winOdu ;
tanuwu sOkina nemtO mudamu ;
chinmaya ruupuni - mOsina mOdamu ;
bahu geerwANamu , amdukanE! amdukanE! :   ||      

 [ పాట 79 ; బుక్ పేజీ 84  , శ్రీకృష్ణగీతాలు ]
;

No comments:

Post a Comment