బృందావనిలో వనమాలి ;
ఆడెను అందెలు ఘల్లనగా,
ఘల్ ఘల్లనగా ;
గోపిక లాడిరి కనులవిందుగా ;
డెందములు ఉప్పొంగుచుండగా : ||
కుంజవిహారీ రసమయ సృష్టి ;
ఈ జగతికి అది "ప్రతి సృష్టి":
జగన్నాటక సూత్రధారిని కని;
జగమే మారెను "వెన్నెల గనిగా" : ||
రాసవిహారీ హేలలలోన ;
వెన్నెల అలలుగా నవ్వెనులే!
గోపీ పడతులు - వేల రేకులుగ :
"బృందావన పుష్పము" వెల్లివిరిసినది : ||
; ==================;
rasamaya jagati ;-
bRmdAwanilO wanamaali ;
ADenu amdelu ghallanagaa,
ghal ghallanagaa ;
gOpika lADiri kanulawimdugaa ;
Demdamulu uppomguchumDagA : ||
kumjawihaarii rasamaya sRshTi ;
ii jagatik adi "pratiSRshTi":
jagannATaka sUtradhaarini kani;
jagamE mArenu "wennela ganigA" : ||
raasawihaaree hElalalOna ; wennela
alalugaa nawwenulE!
gOpI paDatulu - wEla rEkuluga :
"bRmdAwana pushpamu" welliwirisinadi : ||
; [ పాట 81 ; బుక్ పేజీ 86 , శ్రీకృష్ణగీతాలు ] ;
రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ
No comments:
Post a Comment