Thursday, November 10, 2016

మావి చిగురులు

మందార పుష్పము మాధుర్య మధువుతో ;
తొణుకు చున్నాదే, ఏ తేటి కోసమో!?;
గున్న మావి చివురు తోరణమ్ముల తోడ ;
నూగుచున్నాదే - ఏ పికము కోసమో!? :   ||
;
యమున అలలు ; వెన్నెలమ్మ తోడ ;
త్రుళ్ళుచున్నాయి ; ఏ జలధి కోసమో!?:   ||
ముగ్ధ రాధిక - విరహ వేదనల తోటి ;
వేగుచున్నది నేడు - ఏ రాజు కోసమో!? :   ||
;
ఆ మురళి మోహనుడు, నేడింక రాడేమొ యనుచు ;
ఇదె వత్తునంటూ వేడుకల తేలింతు నంటూ -
వట్టి మాటల తోడ వేడుకలు సేయగా; మది నెంచె నేమొ ;
రాధ ఎద చింతల వంతల కుందునంచు తా నెరుగడేమో!? :   ||

===============;;

                maawi chigurulu ;-

mamdaara pushpamu ; maadhurya madhuwutO ;
toNuku chunnAdE, E tETi kOsamO!?;
gunna maawi chiwuru tOraNammula tODa ;
nuuguchunnAdE - E pikamu kOsamO!? :   ||
;
yamuna alalu ; wennelamma tODa ;
truLLuchunnAyi ; E jaladhi kOsamO!?:   ||
mugdha raadhika - wiraha wEdanala tOTi ;
wEguchunnadi nEDu - E rAju kOsamO!? :   ||
;
A muraLi mOhanuDu, nEDimka rADEmo yanuchu ;
ide wattunamTU wEDukala tElimtu namTU -
waTTi mATala tODa wEDukalu sEyagA; madi nemche nEmo ;
raadha eda chimtala wamtala kumdunamchu taa nerugaDEmO!? :   ||

 [ పాట 84  ;  బుక్ పేజీ 89  , శ్రీకృష్ణగీతాలు ]  ;
;

No comments:

Post a Comment