మాధవుడాడెను బృందావనిలో :
అందముగా, ఆనందముగా :
గోపిక లాడిరి కనులవిందుగా : ||
రంగు రంగుల వసంతోత్సవము ;
ఎంత వింత ఈ జీవిత రంగము ;
జనన మరణముల శ్వేత వర్ణము ;
నడుమను విరిసెను హరివిల్లు ;
రంగుల హరివిల్లు ;
ఆది మధ్యాంత రహితుని తోడ ;
ఆడిరి గోపిక లతి సుందరముగ ;
అతివలు ఆడిరి అతి సుందరముగ! : ||
ఆడెను మురళీ లోలుడు తానే :
అణువు అణువున అనంతమూర్తియై ;
రంగుల ఆటే జీవితము ;
గోపీ కృష్ణులె "తారకము" :
ముకుందు ముంగిట ముగ్గుల ప్రోవై ;
అంగనలందరు బంతులాడిరి ;
అతివలు కూడి, బంతులాడిరి : ||
=======================;
;
muraLI lOluDu ;-
maadhawuDADenu bRmdAwanilO :
amdamugaa, AnamdamugA :
gOpika lADiri kanulawimdugA : ||
ramgu ramgula wasamtOtsawamu ;
emta wimta ii jeewita ramgamu ;
janana maraNamula SwEta warNamu ;
naDumanu wirisenu hariwillu ;
ramgula hariwillu ;
aadi madhyaamta rahituni tODa ;
aaDiri gOpika lati sundaramuga ;
atiwalu ADiri ati sumdaramuga : ||
ADenu muraLI lOluDu taanE :
aNuwu aNuwuna anamtamuurtiyai ;
ramgula ATE jIwitamu ;
gOpI kRshNule "tArakamu" :
mukumdu mumgiTa muggula prOwai ;
amganalamdaru bamtulADiri ;
ativlu kUDi, bamtulADiri : ||
;
[ పాట 78 ; బుక్ పేజీ 83 , శ్రీకృష్ణగీతాలు ]
Radha manohara
Radha manohara
No comments:
Post a Comment