Showing posts with label బాలల పద్య గీతాలు. Show all posts
Showing posts with label బాలల పద్య గీతాలు. Show all posts

Tuesday, March 7, 2017

మేలైన బాట

చేమంతి, గులాబీ, మల్లిక ; 
వసుధ ఆయె నేడు 
  అందాలకు వేదిక. 

మోదమ్ములకు వసుంధర. 
వేసెను ఆమోద ముద్ర ; 
ప్రసూనముల వికాసములు. 
ప్రకృతి సంతోష ఘంటిక. 

గాలి స్వచ్ఛతకు బాసట. 
చిరుగాలి జీవులకు ఊరట ; 
పరిమళాల మేళాలతొ ;
జగమంతా కళ కళ

శాంతి,సంతోషములకు
తలమానికము తరువులు .
పచ్చ దనములు సదా
విలసిల్ల వలెను “ ఇల”పైన
సకల లోక శ్రేయస్సు బాట – కిదే
ఇదే మంచి మాట ;  
సదా ఇదే మేలు బాట  
&

జాబిల్లి బాల పత్రిక గీతాలు 
 April 6, 2010   2 Comments
రచన : కాదంబరి పిదూరి   చేమంతి, గులాబీ, మల్లిక 

మబ్బు దుబ్బు జుట్టు

చిట్టి చిట్టి నెలవంక ; 
మబ్బు దుబ్బు జుట్టు తోటి ;
చిరాకుగా ఉన్నది, 
పరాకుగా ఉన్నాది ;  ||
;
కొబ్బరాకు కంఘీని 
   తెచ్చి ఇచ్చె వనదేవి ;
దువ్వుదాము మొయిలు జుత్తు ;   || 

దువ్వెనతో దువ్వుదాము 
   మొయిలు జుత్తు ;  
దిద్దుదాము తీరుగాను ; 
  తీర్చి దిద్దుదాము తీరుగాను ;;  ||
చీకాకు పోగానే 
   పలకరించె నెలవంక ;
చిమ్మ చీకటికి కూడా 
       తాను నేస్తమైనాది ;  || 

నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మేదినిని;
వెన్నెల - నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మానవులను; ;  ||

====================;

ciTTi ciTTi nelawamka ; 
mabbu dubbu juTTu tOTi ;
ciraakuagaa unnadi, 
paraakugaa unnaadi ;  ||

kobbaraaku kamghiini 
tecci icce wanadEwi ;
duwwudaamu moyilu juttu ; 
duwwenatO duwwudaamu moyilu juttu ;  || 

diddudaamu teerugaanu ; 
teerci diddudaamu teerugaanu ;;  ||

ceekaaku pOgaanE 
palakarimce nelawamka ;
cimma ceekaTiki kUDA 
taanu nEstamainaadi ;  || 
;
nawwulanu cimdistuu, 
wamgi cuuse mEdinini;
wennela - nawwulanu cimdistuu, 
wamgi cuuse maanawulanu; ;  ||

& [ మా రచనల పట్టిక, జాబిల్లి, 
        బాల కవితా గీతములు, గీత రూపకము,  ] 
మబ్బు దుబ్బు జుట్టు ;
Jabilli , many [ LINK ]

Friday, November 4, 2016

అంగీకరిస్తున్నావా!?

జనని లాలి పాటలు ;
మాత జోల పాటలు ;
క్రిష్ణయ్యా!! నిన్నెన్నో విద్యలలో ;
నేర్పుమంతుడిగ చేసెను ;
ఒప్పుకుంటావా!? 
మరి, కాదని తప్పుకుంటావా!? ; ||
;
అనగనగా కథలు చాల ;
వాజి పయిన వీరుడు ;
బుల్లి రాజ కుమారుడు ;
అగణితమౌ కల్పనలు, 
నీదు స్వప్న పల్లకీలు ; 
మోసుకొచ్చు పరిమళాల పుష్పాలు ||
;
యశోద మాత కథల 
సాధు స్వాదు మృదు వీణా రాగములు ;
ఆ రాగములను ;
నీ వేణువు పొదువుకొనును నిరంతరం ;
ఆ భావమ్ముల సొబగులను 
నీ హృదయం హత్తుకొనును సదా! :
మురళీధరుడవు నీవు ;
;
అన్న యశసు పునాదులకు ;
అమ్మ లాలి పాటలే! క్రిష్ణయ్యా!
ఔనా మరి, ఒప్పుకొందువా నీవు -
కమ్మనైన ఈ నిజం ; 
ఇంత కమ్మనైన ఈ నిజం ;

======================;

janani pADu jOlalu ; shNayyA! 
anaganagaa kathalu chaala ;
waaji payina weeruDu ;
bulli raaja kumaaruDu ;
agaNitamau kalpanalu, 
needuswapna pallakiilu ;   ||
;
nee wENuwu poduwukonunu ;
yaSOda maata kathaa 
         weeNa raagamulanu ;
muraLIdharuDawu neewu ;
anna yaSasu punaadulaku ;
amma laali pATalE! krishNayyA!
aunaa mari, oppukomduwaa neewu -
kammanaina ii nijam ; 
imta kammanaina ii nijam ;    || 
 ; 
[ పాట 78 ; బుక్ పేజీ 83  , శ్రీకృష్ణగీతాలు ] 

Friday, August 28, 2015

శాంతి విలువ, Pigeon


చిట్టీ! ఓ చిట్టీ!
'పారావతము', పిజియన్
అంటే ఏమిటొ నీకు 
తెలుసునా చెప్పవమ్మ! ||
చిట్టి  :-
పారావతము, pigeon
అంటే 'పావురము, తెలుసమ్మా!!

మరి పావురమును 
నెహ్రూ ఆదిగా నేతలు
శాంతి ప్రతీకగ కీర్తిని
పొందినది పావురాయి! 

శాంతి విలువ లోకులకు 
గుర్తు చేయ, ఇలకు నీవు 
మరల మరల రావోయి
సున్నితముగా పావురాయీ!

========================

గిజిగాడు - గూడు

బంగారు పిచ్చిక
గిజిగాడు మచ్చిక 
  బుల్లి బుల్లి రెక్కలకు
   నటనాల ఆటలంట!  ॥ 

తన రెక్కల ఆడింపులు  
గాలిలోన కట్టినట్టి
అందమైన మేడలు || 

గగన తెరల పయి 
కాంచన కలశమ్ము వోలె  
చెట్టు యొక్క కొమ్మ కొసల
గొప్ప నిర్మాణత శోభిల్లెను ॥ 

ఇంద్రభవనమ్ముల కన్నా
నా 'మహల్ గూడు' బహు గొప్పది
అని చూపును గీరగాను
తన, మెహర్బానీ చెప్ప తరమా!?||

**************************

రచన:- కుసుమాంబ1955
 పిట్టలలో మేల్మి పసిడి 

Thursday, August 27, 2015

ఒహోహో! పావురమా!

చిట్టి చిట్టి పావురాయి;
సాగిపోవు నీలి నింగి;
పొడవాటి రెక్కలను;
నిడివిగాను చాచి, చాచి
      గాలి అలల పయిన - సుతిమెత్తగ 
         అలా,  అలా, అలా,  అలా || 

చల్లదనము వెన్నెలకు;
నేర్పుటకై ఎగురుతూ సాగినది
    గాలి అలల పయిన - సుతిమెత్తగ 
         అలా,  అలా, అలా,  అలా || 
;

Tuesday, August 11, 2015

చదరంగంలో Camel

ఒంటె ఒకటి; ఎడారి ఓడ; 
చదరంగంలో వయ్యారి పాను;  
చతురం చతురం చదరంగం 
చతురం చతురం షత్రంజ్ ఆట ॥ 

కన్నురెప్పలు మూడు చొప్పున; 
ఆరు కలిగిన వింత జంతువిది;
మూపున నీళ్ళ ఫ్రిజ్ దాచుకుని
ఎండనుబడి తానెన్ని మైళ్ళు, క్రోసులు
యోజన దూరాల్ 
అలసట లేక నడవగలుగును
ఒంటె సవారీ బలే హుషారు
నేను ఇచ్చిన నీళ్ళను త్రాగి 
తుమ్ములు వచ్చెను కేమెల్ గారికి.
హాచ హాచ్ హాఛ్! ...... 
*********************

( Chess బోర్డులో bishop ; షత్రంజ్ బోర్డులో 16 pieces)

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

 [ పిల్లలకు పద్య గీతాలు   ; రచన : కోణమానిని  ]

Sunday, June 28, 2015

కీలు గుర్రం

చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!; 
వేకువ మాతా! హల్ చల్ చల్! ||
పుడమి రాణికీ టింగణా గుర్రం; 
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్ 
ఛల్ ఛల్  ఛల్  చలాకి గుఱ్ఱం ॥ 

పంచ కళ్యాణీ ఛల్ ఛల్ ఛల్! 
బాలపాపలకు కీలుగుర్రము 
మారాం పిల్లకు కొయ్యగుర్రము
మంచి పాపలకు రెక్కలగుఱ్ఱము
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 

మారాం చేయకు పాపాయీ!
మారాం, హఠములు మానేస్తే; 

నీకూ దొరుకును జవనాశ్వం - గుఱ్ఱం
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 
====================

 kIlugu~r~ram / 
          kiilu gurram :-

chiikaTi bUchI! Cal Cal Cal!; 
wEkuwa mAtA! hal chal chal!
puDami raaNikI TimgaNA gurram; 
Cal Cal  Cal  Cal Cal  Cal  
Cal Cal  Cal  chalaaki gurram; ||

pamcha kaLyaaNI Cal Cal Cal! 
baalapaapalaku kiilugurramu; 
maaraam pillaku koyyagurramu;
mamchi paapalaku rekkalagurram;
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

maaraam chEyaku paapaayI!
maaraam, haThamulu maanEstE; 

nIkU dorukunu jawanaaSwam - gu~r~ram (= ఱ్ఱం)
Cal Cal  Cal  Cal Cal  Cal   
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

*************************
పిల్లలు కట్టే గుజ్జన గూళ్ళు july 28 wednesday 2010;

సంతోషమ్మే సగము బలమురా! 

ఏ ముని తపస్సు చెదిరినదో?

వియత్తలిని పాదముతో:     
కొలిచినాడు క్రిష్ణుడు, 
మన చిన్నారి  క్రిష్ణుడు! ||

ఏ ముని తపస్సు చెదిరినదో? 
ఏ బ్రహ్మర్షి - 
ధ్యానమ్ము భంగమయ్యినదో!?; 
చిటికెలోన 
దేవకీ- గర్భమ్మున దూరినాడు
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు   || 

అమూల్యమణుల గని ఈతడు; 
సువర్ణ ప్రభల నిలయము; 
మన ధరణికి -
తేజస్సుల వరమయ్యెను, 
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు  ||

ఎంతగా స్తుతించినా; 
ఎంతని వర్ణించినా; 
ఏమని వివరించినా: 
తనివితీరదే! తనివితీరదే!
మన చిన్నిక్రిష్ణుని/ డు 
॥ అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు ॥   
===================
 
wiyattalini paadamutO: 
kolichinaaDu krishNuDu, 
mana chinnaari  krishNuDu||

E muni tapassu chedirinadO? 
brahmarshi dhyaanammu 
bhamgamayyinadO!?; 
chiTikelOna 
dEwakii garbhammuna duurinaaDu 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || || 

amuulya maNula gani iitaDu; 
suwarNa prabhala nilayamu; 
mana dharaNiki; 
tEjassula waramayyenu, 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu ||

emtagaa stutimchinaa; 
emtani warNimchinaa; 
Emani wiwarimchinA: 
taniwitiiradE! taniwitiiradE! 
mana chinnikrishNuni/ Du 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || 
 
***********************************
అఖిలవనిత
Pageview chart 31658 pageviews - 786 posts, last published on Jun 16, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59103 pageviews - 1018 posts, last published on Jun 24, 2015 - 7 followers
Telugu Ratna Malika
Pageview chart 4424 pageviews - 127 posts, last published on Jun 22, 2015
 

Thursday, June 11, 2015

Camel భారీ

ఒంటె, ఊష్ట్రం,  ఎడారి ఓడ; 
పంచతంత్రమున కరభకము 
ఆంగ్ల భాషలో camel అందురు  
చదరంగంలో వయ్యారి పాను;  

కన్నురెప్పలు మూడు చొప్పున; 
ఆరు కలిగిన వింత జంతువిది;

మూపున నీళ్ళ ఫ్రిజ్ దాచుకుని
ఎండనుబడి తానెన్ని మైళ్ళు, క్రోసులు
యోజన దూరాల్ అలసట లేక నడవగలుగును

ఒంటె సవారీ బలే హుషారు
నేను ఇచ్చిన నీళ్ళను త్రాగి 
తుమ్ములు వచ్చెను కేమెల్ గారికి.
హాచ హాచ్ హాఛ్! ...... 












౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
రచన : కోణమానిని 
rachana : kONamaanini 


అఖిలవనిత
Pageview chart 31269 pageviews - 783 posts, last published on Feb 23, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4372 pageviews - 126 posts, last published on Jan 14, 2015 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58662 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog