Sunday, November 13, 2016

కృష్ణలహరి

మమత అంటే
  వెతలు అంటూ
      అర్ధం తెలిపావు!
వెతలకు  నే
   భాష్యమౌదు
        సంతసమ్ముతో! ;  ||
;
ఎదను ప్రేమగాయమాయెను!
కృష్ణా! అది, చరిత =
  జీవ కాయమాయెను!
    జీవన కావ్యమాయెను! ;  ||

వేణు రవము ;
వినబడదు రవ్వంతైనా!
కంకణాల రవళి
సడి లేదు, అణువంతైనా! ;  ||
;
యమునా నది సైకతాల ;
 కితకితలేవి?
   నాటి కితకిత లేవీ? ;
నందనవని పులకింతలు
    నిశ్చలమాయేను ;
        నేడు శూన్య మాయెను ;

క్షణ మాత్రంలోనే
ఇంతటి పరిణామాలా? ;
వైపరీత్యములు -
వలపుకు తుది గమ్యాలా? ;  || ;

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

 kRshNalahari ;-
mamata amTE
  wetalu amTU
     ardham telipAwu!
wetalaku  nE
   BAshyamaudu
        samtasammutO! ;  ||
;
edanu prEmagaayamaayenu!
kRshNA! adi, charita =
  jeewa kaayamaayenu!
    jIwana kAwyamAyenu! ;  ||

wENu rawamu ;
winabaDadu rawwamtainA!
kamkaNAla rawaLi
saDi lEdu, aNuwamtainA! ;  ||
;
yamunaa nadi saikataala ;
 kitakitalEwi?
   nATi kitakita lEwI? ;
namdanawani pulakimtalu
    niSchalamAyEnu ;
        nEDu SUnya mAyenu ;

kshaNa mAtramlOnE
imtaTi pariNAmAlaa? ;
waipareetyamulu -
walapuku tudi gamyaalaa? ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼▼▼▼
కృష్ణలహరి ;-

 [ పాట 91 ; బుక్ పేజీ 96  , శ్రీకృష్ణగీతాలు ]

No comments:

Post a Comment