Sunday, November 13, 2016

చిరుగాలి

వేణువులో చోటు దొరికి ;
సంభ్రమమున చిరు గాలి ;
అటు ఇటు నటు నటనమాడెను,
నాట్యమాడెను ;  ||

తన ప్రతి కదలిక రాగమై ;
వసుధపైన పరుచుకొనగ ;
విభ్రమమున తేలి ఆడె ;  ||

ధరణి పైన అణువణువు;
చేతనమే నింపుకొనెను ;
కన్నయ్యా! నీ కొరకే ;
ఈ రాధిక జననము ;  ||
;
వంశీ హృదయ కుటీరమున ;
కృష్ణ రమ్య నామము ;
ధ్యానము, మననము ;
అనుక్షణము మెసవెడి ;
మధుర సుధా పానము ;  ||
;
మురళిలోన నర్తించెడు ;
గాలిహేల ధన్యము!
నీల మోహనాంగుని హృత్ ;
నివసినియౌ రాధ చరిత సార్ధక్యము ;
ఈ రాధ విరళ చరితము -
ప్రతి పదము సార్ధక్యము ;  ||


▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
wENuwulO chOTu doriki ;
samBramamuna chiru gaali ;
aTu iTu naTu naTanamADenu,
nATyamADenu ;  ||

tana prati kadalika raagamai ;
wasudhapaina paruchukonaga ;
wibhramamuna tEli ADe ;  ||

dharaNi paina aNuwaNuwu;
chEtanamE nimpukonenu ;
kannayyA! nI korakE ;
ii raa dhika jananamu ;  ||

wamSI hRdaya kuTIramuna ;
kRshNa ramya naamamu ;
dhyaanamu, mananamu ;
anukshaNamu mesaweDi ;
madhura sudhA pAnamu ;  ||

muraLilOna nartimcheDu ;
gaalihEla dhanyamu!
nIla mOhanAguni hRt ;
niwasini yau
raadha charita saardhakyamu ;
ii raadha wiraLa charitamu -
prati padamu saardhakyamu ;  ||

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

 [ పాట  90 ; బుక్ పేజీ 95   , శ్రీకృష్ణగీతాలు ]  ; 

No comments:

Post a Comment