Thursday, November 10, 2016

వాని జాడలు

నాదు చేల చెరగు జారిపోయె నెచటనో!? ;
చెంగు చెంగున గెంతు లేడికూన ల్లార!
;         కాస్తైన తెలుపరే! :  ||

నాదు కొప్పున పూవు జారేను ఎటనో!?
ఎగసి దూకేటి - యమున తరగల్లా!
;         సుంతైన తెలుపరే; :  ||

నాదు డెందమ్మెటనో జారి పోయేను ;
అల్లనల్లన మ్రోగు - - వెదురు వేణువులార!
;          కాస్త మీరైన తెలుపరే! :  ||

==============;

           wAni jADalu ;-
naadu chEla cheragu jaaripOye nechaTanO!? ;
chemgu chemguna gemtu - lEDikUna llAra!
kAstaina teluparE! :  ||

naadu koppuna puuwu jaarEnu eTanO!?
egasi dUkETi - yamuna taragallA!
sumtaina teluparE; :  ||

naadu DemdammeTanO jAri pOyEnu ;
allanallana mrOgu - weduru wENuwulAra!
kAsta meeraina teluparE! :  ||

 [ పాట 83  ; బుక్ పేజీ 88  , శ్రీకృష్ణగీతాలు ]  ;
;
రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ

No comments:

Post a Comment