Sunday, November 13, 2016

అనురాగ బాటలలో

ప్రశ్న : ఏటి అలల మిలమిల ;
శీతాంశు కిరణమ్ముల ; ;
కేల ఇంత గిలిగింతలు!?;

జవాబు: వింత లేదు ఇందు సుంత! ;
చెలి చూపులు సోకినంత;
కలిగినదా వింత!
గిలిగింత, పులకింత! ;

ప్రశ్న: సుప్త జలద మభ్యున్నత ;
జాగృతిని పొంది, లేచి ;
తొలకరుల చిరు జల్లుల ;
ఉద్వర్తనములు ఏల చేయు? ;

జవాబు: వింత లేదీ వర్తనమున ;
చెలి చూపుల పొలుపు సోక ;
శిలకైనను మత్తు వదులు!  ||

ప్రశ్న:మందముగా ఉన్న వసుధ ;
హడావుడిగ లేచి ,
ఏల - విలువ గల వస్త్రములు ;
ధరియించెను హడావుడిగ;
ఏల కలిగె నింత సందడి? ఈ సందడి?

జవాబు : -
పునరుక్తి దోషములు
         పదే పదే వలదు, వలదు!
నాదు హృదయ సామ్రాజ్ఞీ!
        నీదు ఆగమనమ్ముల హేల ;
మరుత్ తంత్రీ గమకములై ;
    అను 'రాగ' మార్గముల పైన ;
          సాగినవీ మును ముందుకు! :

 =============== ;

                anuraaga bATalalO ;-

praSna : ETi alala milamila ;
SItAmSu kiraNammula ; ;
kEla imta giligimtalu!?;

jawaabu:
wimta lEdu imdu sumta;
cheli chuupulu sOkinamta;
kaliginadaa wimta!
giligimta, pulakimta! ;

praSna: supta jalada mabhyunnata ;
jaagRtini pomdi, lEchi ;
tolakarula chiru jallula ;
udwartanamulu Ela chEyu? ;

jawaabu: wimta lEdii wartanamuna ;
cheli chuupula polupu sOka ;
Silakainanu mattu wadulu!  ||

praSna:- mamdamugaa unna wasudha ;
haDAwuDiga lEchi ,
Ela - wiluwa gala wastra -mulanu ;
dharimchenu, haDAwuDiga;
Ela kalige nimta samdaDi? I samdaDi?

jawaabu : -
punarukti dOshamulu
padE padE waladu, waladu!
naadu hRdaya saamraaj~nI!
needu aagamanammula hEla ;
marut tamtrI gamakamulai ;
anu 'raaga ' maargamula
paina ; saaginawee munu mumduku! :
;
 [ పాట 88  ; బుక్ పేజీ 93  , శ్రీకృష్ణగీతాలు ]   [ పాట 88  ; బుక్ పేజీ 93  , శ్రీకృష్ణగీతాలు ]

No comments:

Post a Comment