మలయ శీతల సమీరముల ;
మాలతి రావే!
తరుణి లలాటమ్మున ;
తిలకముగా వరలుమా!
వరమది నీకెపుడో ;
లభియించెను రతి ద్వారా!
పుష్పధనుడిక వేడుకొనును
నిను శరమున చేరమనీ!
తన సుమ శరమున చేరమనీ!
;
కవీంద్రుల కావ్యముల
విరిసిన మహరాణీ!
క్రిష్ణ రాధికా ప్రణయాలకు
సుగంధముల చాందినీ!
మాధవ మనోహ్లాదినీ!
******************;
malaya SItala samIramula ;
maalati rAwE!
taruNi lalATammuna ;
tilakamugaa waralumA! ||
waramadi neekepuDO ;
labhiyimchenu rati dwaaraaa!
pushpadhanuDika wEDukonunu
ninu Saramuna chEramanii!
tana suma Saramuna chEramanii!
;
kawiimdrula kaawyamula
wirisina maharANI!
krishNa raadhikaa praNayaalaku
sugamdhamula chaamdinI!
maadhawa manOhlaadinii!
******************************;
మాధవ మనోహ్లాదినీ!/ మాధవ మనోల్లాసినీ! [bhaawuka] ;-