Wednesday, June 29, 2011

కొరియా దేశంలో అద్భుత శిల్ప, వృక్ష సీమలు

















కొరియా దేశంలో Clan Registry Park ఉన్నది.
ఇక్కడ కొరియా దేశములోని-
యోధుల వంశీయుల పేర్లను ఇచ్చట రిజిస్టర్ చేస్తూంటారు.
ఒక registry monument  ముందర
నిలబడిన మహిళను ఈ ఫొటోలో చూడవచ్చును.
(see the LINK 1)

@@@@@@@@@@@@@@@@@@@

















ఇక్కడ కొరియా దేశములో
ఒక బౌద్ధ ప్రదర్శనశాల (Buddhist museum) కలదు.
ఇక్కడ ప్రశస్తమైన బుద్ధ దేవుని విగ్రహము ఉన్నది.
ఆ statute కు అక్షరాలా సహస్ర హస్తములు-
అనగా వెయ్యి చేతులు ఉన్నవి.
1000 little hands back న చేయగలిగిన అజ్ఞాత శిల్పి కళా ప్రజ్ఞ
చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నది.


        Clan Registry Park  {LINK-1}



Monday, June 27, 2011

ధేనువుల విలువ
















కసవు మెసవే గోవు- నంద బాలుని స్పర్శ
నీలాగునన్ పొందెను
ఆలమందల విలువ- నందరికి తెలిపిన
గోపాలుడన్నచో అందరికి ముద్దు కద, ఓ యమ్మా!
గారాబములన్ని ఆతనికె కద తెలియ ఓ యమ్మా! ||  

భక్త కోటి పాలి కల్పకము క్రిష్ణుడు      
కారుణ్య సింధువు; గోవర్ధనోద్ధారు    
ప్రతి వాక్కు ఒక సూక్తి ;              
పలుకు పలుకుల రూపు నిండు భగవద్గీత;  
పలుకు విలువల నెల్ల జనులకు బోధ పడె          
నీల మోహన క్రిష్ణ
గొప్ప మహిమల వలననే ఓ యమ్మా!   ||

ఇరు దిక్కులందున శంఖ, చక్రమ్ములు;          
కుడి ఎడమలందున శ్రీ దేవి, భూదేవి                  
దక్షిణగ తిరు నాధు -        
సర్వ దర్శన భాగ్య- కలిమి లాభము కలిగె!!!!  
మా-భక్త జన కోటి నయన పర్వములాయె!      
నీల మోహన క్రిష్ణ
గొప్ప మహిమల వలననే ఓ యమ్మా!  ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


kasavu mesavE gOvu-naMda baaluni sparSa
nIlaagunan poMdenu
aalamaMdala viluva- naMdariki telipina
gOpaaluDannachO aMdariki muddu kada, O yammaa! ||

gaaraabamulanni aatanike kada teliya O yammaa! ||

Bakta kOTi pAli kalpakamu krishNuDu
kaaruNya siMdhuvu; gOvardhanOddhaaru
prati vaakku oka sUkti ;
paluku palukuna niMDu BagavadgIta;
paluku viluvala nella janulaku bOdha paDe
nIla mOhanu valana ) yammaa!   ||

SaMKa, chakrammulu; SrI dEvi, BUdEvi
kuDi eDamalaMduna
dakshiNaga tiru naadhu sarva darSana BAgya
lABamu kalige namma!
maa-Bakta jana kOTi nayanammulaku; O yammaa!  ||


@@@@@@@@@@@@@@@@@@@@@


        printsofjapan- wordpress-hinduism    (Link read:-  జపాన్ బ్లాగు) 


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ఏడుకొండల పుష్పము












ఘన తపః ఫలముగా-సప్తాద్రులు పొందె
          అవనిజాపతి సన్నిధిన్
అవధి లేని మోద జగతిగా
       తామెల్ల- వేళలన్ విరబూయుచూ ఉన్నవి
            ఏడుకొండలు విరబూయుచూ ఉన్నవి ||

దశ దిశలకూ దొరికె- నీ కేంద్ర బిందువు;
ద్వాదశాదిత్యుల అర చేతి కమలముగ
ఏడు కొండల శ్రేణి భాసిల్లుచున్నదమ్మా!
                  ఎల్ల వేళల భాసిల్లుచున్నదమ్మా!   ||
సౌభాగ్య సీమగా వెలుగొందు ఘన సీమ
శ్యామలాంగుని నెలవు – శ్రీ తిరుమలాద్ర్యాలయము;
    ఎల్ల వేళలన్ వెలుగొందుచున్నదమ్మా!   ||


@@@@@@@@@@@@@@@@@@@@@@@

        EDukoMDala pushpamu 


Gana tapa@h phalamugaa-saptaadrulu poM-de
de- avanijaa pati sannidhin
avadhi lEni mOda jagatigaa taamella vELalan
          virabUstunnavi     ||

daSa diSalakU dorike- nI keMdra biMduvu;
dwaadaSAdityula ara chEti kamalamuga
EDu koMDala SrENi BAsilluchunnadammA!   ||
                                       
sauBAgya sImagaa velugoMdu Gana siima
SyaamalaaMguni nelavu –
SrI tirumalaadryaalayamu    ||


@@@@@@@@@@@@@@@@@@@@@@@

Monday, June 20, 2011

బాపూ (దర్శకుడు) వేసిన మొదటి బొమ్మ


పశ్చిమ గోదావరి జిల్లాలో, నర్సాపూర్ లో  జన్మించిన 
అపురూప ఆర్టిస్టు  సత్తిరాజు లక్ష్మీ నారాయణ. 
ఓహో! అర్ధం కాలేదా?!? 
అదేనండీ...... ఇది అసలు పేరు, 
కానీ, అందరికీ ఆయన తెలుసు ;
"బాపు"అనే పేరుతోనే!
పేరెన్నిక గన్న బాపు, 
మన ఆంధ్ర దేశానికే పేరు తెచ్చిన 
పేరిమి చిత్రలేఖన, కార్టూనిస్టు.
ముళ్ళపూడి వేంకట రమణ , బాపు ద్వయం 
వెండి తెరకు మేలిమి బంగారం లాంటి 
సినిమాలను అందించారు. 
అది సరే గానీ, 
బాపు చిన్నప్పుడు, 
తన బాల్యంలో ఎలిమెంటరీ స్కూలులో చదువుతూన్నప్పుడు 
ఒక మంచి బొమ్మను వేసాడు/రు.
బాల బాపూ లేఖిని నుండి వెలువడిన వర్ణాల బొమ్మ - బాల గణేశ 

&&&&&&&&&&&&&&&&

మరి అదే చిత్రాన్ని 
ఇలా గీసినందుకు బాపుగారికి ....ప్చ్!!!!!
See this Link
at - Vijayamohan59-Blog:
Here BAPU bommalu;
Why they have not got any AWARDS/ or riwards 
from our great Indian Government?????
ఇలా గీసినందుకు ఉస్సేనుగారికి పద్మశ్రీ


మరి ఈయనకో .....
       no prizes, no awards!!!!! 

మువ్వన్నెల జెండా















అమ్మా! ఇవిగో, కనకాంబరములు!
అంబర సొగసులు ఈ పుష్పాలవి కదా!

అక్కా!అక్కా! ఇదిగో మల్లె!
నీ తెల్లని నవ్వుకు ప్రతిరూపం!

అన్నా! అన్నా! పూ బంతి!
బంతి ఆట నీకు గుర్తొస్తే ఎలా?

చెల్లీ! ఇదిగో చేమంతి!
పచ్చని మేలిమి వలువల రాణి!

నాన్నారూ! శివ లింగం పూవు!
దేవుని అర్చన చేద్దాము!

శాంతం, ధర్మం , క్రమ శిక్షణలకు
మీరే నిలిపే రత్నఛత్రము!
ఇదిగో! త్రివర్ణ పతాకము!

రెప రెప లాడును ఎల్లప్పుడునూ!
జెండావందనములు చేద్దాము!
జడలో, సిగలో, తోరణ పూవులు;
సెల్యూట్ చేతుల మన కేతనము!
         "జై హింద్! జై హింద్
                  జై హింద్! జై హింద్!"

*********************************

Tuesday, June 14, 2011

ఆట కళలు 1,

















అనాది కాలం నుండీ ప్రపంచములో ఆట పాటలు -
వాటితో పాటు లలిత కళలు క్రమక్రమంగా అభివృద్ధి గాంచాయి.
కొన్ని సార్లు కొన్ని మత సంస్థలు ఆయా దేశాళ్ల్లో నిషేదించేవి.
అయినా సరే!..... అ నిషేధాజ్ఞలు కొన్నాళ్ళ తర్వాత గాలిలో కలిసేవి.
ప్రజలు అలాంటి మూఢ విశ్వాసాలకు సంబంధించిన నిషేధ ఆజ్ఞ లను బేఖాతరు చేసేవారు.
మానసికోల్లాసానికి కళలు మూల స్తంభాలు అవడమే ఇందుకు ముఖ్య కారణం.
సంగీత, సాహిత్య, చిత్రలేఖన, శిల్ప కళాదులు
అన్నీ బహుముఖీనంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.
మరి ఆ కళలకు అనుబంధంగా -
ఆహార్యములూ, మేకప్పు, రంగస్థల అలంకరణలు,
పుస్తకములు, పైంటింగులూ, బ్రష్ లూ కుంచెలూ, ఇలాగ ........
అనేక సామగ్రి అవసరం ఔతూ వచ్చాయి.
ఆయా వస్తు సంబారాల తయారీ - కుటీర పరిశ్రమలుగానూ,
నేడు అవి- భారీ పరిశ్రమల స్థాయికి పెంపొందాయి.
తద్వారా లక్షలాదిమందికి జీవనోపాధి లభిస్తూన్నది.
ఆట వస్తువుల తయారీ కూడా ఈ కోవలోనిదే!
అన్ని దేశాలలోనూ బాల బాలికల కోసం-
పురాతన కాలం నుండీ-క్రీడా వస్తువులు అనేకములుగా  ఉత్పత్తి ఔతూ వస్తూన్నాయి.
వివిధ దేశాలలోని ప్రాచీన ఆట, వినోద వస్తువులనూ, బొమ్మలనూ చూద్దామా!!!!!!!!
ఓరిగమీ కళ ప్రపంచవ్యాప్తంగా కళాభిమానులందరూ, నేర్చుకుని, చేస్తూన్నారు.
జపాన్ దేశంలో అనేక వేల సంవత్సరాల నుండీ ఈ ఒరుగమీ కళ వృద్ధి చెందింది.
origami toy కి మరో పేరు- jumping jackఅని కూడా ఉన్నది.
మరి మీరు కూడా అలాటి దానిని చూస్తారా?
        [ఆట కళలు-1] 
          http://www.ehow.com/how_7789520_make-origami-jumping-jack.html                                                                                                         How to Make an Origami Jumping Jack          
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
anaadi kaalaM nuMDI prapaMchamulO aaTa paaTalu -
vaaTitO pATu lalita kaLalu kramakramaMgaa aBivRddhi gaaMchAyi.
konni saarlu konni mata saMsthalu aayaa dESALllO nishEdiMchEvi.
ayinaa sarE!..... a nishEdhaaj~nalu konnaaLLa tarvaata gaalilO kalisEvi.
prajalu alaaMTi mUDha viSvaasaalaku
saMbaMdhiMchina nishEdha aaj~na lanu bEKaataru chEsEvaaru.
maanasikOllaasaaniki kaLalu mUla
staMBAlu avaDamE iMduku muKya kaaraNaM.
saMgIta, saahitya, chitralEKana,
Silpa kaLAdulu annI bahumuKInaMgA vyaapti cheMdutUnE unnaayi.
mari A kaLalaku anubaMdhaMgaa -
aahaaryamuluu, mEkappu, raMgasthala
alaMkaraNalu, pustakamulu, paiMTiMgulU, brash lU kuMchelU, ilaaga ........
anEka saamagri avasaraM autU vachchaayi.
aayaa vastu saMbaaraala tayaarI - kuTIra pariSramalugaanU,
nEDu avi- BArI pariSramala sthaayiki peMpoMdaayi.
tadvaaraa lakshalaadimaMdiki jIvanOpaadhi laBistUnnadi.
ATa vastuvula tayaarI kUDA I kOvalOnidE!
anni dESAlalOnU baala baalikala kOsaM-
puraatana kaaalaM nuMDI-krIDA vastuvulu anEkamulugaa  utpatti autU vastUnnaayi.
vividha dESAlalOni praachIna
ATa, vinOda vastuvulanuu, bommalanuu chUddaamaa!!!!!!!!
OrigamI kaLa prapaMchavyaaptaMgaa kaLABimAnulaMdarU,
nErchukuni, chEstUnnaaru.
japaan dESaMlO anEka vEla saMvatsaraala nuMDI
I orugamI kaLa vRddhi cheMdiMdi.
#origami toy# ki marO pEru- #jumping jack#ani kUDA unnadi.
mari mIru kUDA alaaTi daanini chUstaaraa?  





Monday, June 13, 2011

ధారా శుద్ధిగ ఆశు కవిత్వము
















మింట ఇంటను ప్రతి ఒక్కరికీ-
ఈ దడబిడలెందుకనీ!?;
ఈ బిర బిర పరుగులు ఎందుకనీ!?;
హర్షాతిరేకతలు ఎందుకనీ!? ||

ధారా శుద్ధిగ చెప్పుచున్నవి;
ఉరుముల జయ జయ నాదాలు, నినాదాలు
గగన మహలులో నీరద రాసులు
భట్టు రాజులు ఐనాయి  ||

ఏక ధాటిగా మెరుపుల కృతులను
రాస్తూ ఉన్నవి వాన మొయిళులు;
ఆశు కవిత్వము ధారలుగా-
కురిపిస్తూండెను వరుణ దేవుడు       ||

పచ్చ దనమ్ముల-కజ్జలములను-
చేసుకున్నది వన దేవి;
పైరుల ఘంటము కదలికలో
క్రిష్ణ కావ్యము వెలసినది  ||

మింట ఇంటను ప్రతి ఒక్కరికీ-
ఈ దడబిడలెందుకనీ!?;
హర్షాతిరేకతలు ఎందుకనీ!? ||

కజ్జలము=సిరా మసి, ink

$$$$$$$$$$$$$$$$$$$$

dhaaraa Suddhiga cheppuchunnavi;
urumula jaya jaya naadalu, ninaadaalu
mabbulu BaTraajulu ainaayi, gagana mahalulO;
Eka dhaaTigaa merupula kRtulanu raastU unnavi vaana moyiLulu;
miMTa iMTanu prati okkarikii-
I daDabiDaleMdukanI!?;
harshaatirEkatalu eMdukanI!?
aaSu kavitvamu dhaaralugaa-
kuripistUMDenu varuNa dEvuDu       ||

pachcha danammula- siraalanu- chEsukunnadi vana dEvi;
pairula GaMTamu kadalikalO- krishNa kaavyamu velasinadi  ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Sunday, June 12, 2011

నవలాకుల పెదవుల పక పక నవ్వులు

































కన్నయ్యా! నీ మూలాన్నే
ఇన్ని ఇడుములు, ఇక్కట్లు/ట్లూ వేలాది!
మరి ఇబ్బందులు వేలాదిగా!
ఆది నారాయణ!
నమో నమ/మః! నమో నమ/మః  ||

కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                    ||

మన్నులు తిందువు పంకజ నేత్రుడ!
"నవనీతము తీయగ ఉన్నద"నీ
నవలాకుల పెదవుల పక పక-
నవ్వులు గ్రుమ్మరింతువు
కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                  ||


మా బుల్లి రాముడు-కడు బుద్ధిమంతుడని –
ఇపుడే ఇపుడే మా యశోద మాత
అందరితోనూ చెప్పినదయ్యా!/ ది;
తల్లి మాటను - వమ్ము సేయకుర!
కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                 ||


ముద్దు క్రిష్ణ! హత్తెరిగీ!! సిరి!






















ఇన్ని వింతలకు నీవు
మారు రూపువైనావు;
హత్తెరి! సిరి! ఏలాగున?
తెలుపవోయి, ముద్దు క్రిష్ణ! ||హత్తెరి! సిరి!||

అంత ఎత్తు నింగిలోకి;
ఆకసము/ఆకాశము -నకెదిగినావు;
ఇంత చిన్న మర్రి ఆకు
ఎటులాయెను నీకు డోల!?  ||హత్తెరి! సిరి!||

దేవకి ఒడి నుండీ దిగీ
వ్రేపల్లియ సీమ చేరి
కొంగు-పసిడివైనావు నీవు
హత్తెరి! సిరి! ఏలాగున?  
తెలుపవోయి, ముద్దు క్రిష్ణ! ||హత్తెరి! సిరి!||

&&&&&&&&&&&&&&&&&&&&&&

inni viMtalaku nIvu
maaru rUpuvainaavu;
hettwri! siri! Elaaguna
telupavOyi muddu krishNa!        ||

aMta ettu niMgilOki; 
aakasamu/akASamu -nakediginaavu;
iMta chinna marri Aku
eTulaayenu nIku DOla!        ||

dEvaki oDi nuMDI digii, 
vrEpalliya sIma chEri
koMgu baMgaaruvaitivIvu/ vainaavu nIvu/
hatteri! siri! Elaaaaguna?
telupavOyi, muddu krishNa! ||

హారతి! శుభ హారతి!


















భక్తుల హృది ఊది వత్తు-
లింపారుగ ధూపములు;
మధు ధూపముల -
హారతీ! శుభ హారతీ!      ||హారతీ!||

మేఘాల - మబ్బుల అపరరంజీ
పళ్ళెరముల పూర్ణ జ్యోత్స్న ప్రమిదలు
దివ్య ప్రభలు శత కోటి     ||హారతీ!||

మా నేత్ర పుష్ప పరాగముల
అత్తరుల మృదు జల్లులు;
పరిమళ పన్నీరు శత కోటి  ||హారతీ!||

మోహన రూపా! గోపాలా!






















మొలక నవ్వుల చందురుడా!
జలజ నాభుడా! వందనము!
మోహన రూపా! వందనము ||

కమలాసన ప్రియ వల్లభుడా!
రమణి జానకీ హృదయేశా!
శాంతి పూవులీ సీమలలో
విరబూయును నిరతము
            నీ వలనే!    ||

జలజాతాసన వాత్సల్యా+
నంద మందిర సుఖ ధామా!
నంద నందనా! శ్రీ క్రిష్ణా!
వేయి నామముల గోవిందా!    ||

@@@@@@@@@@@@@@

తరు సంపద అంటే ఎంతో ఇష్టం!






















తరు సంపద అంటే, ఓ స్వామీ!
నీకెంతటి మరులూ, మమకారం!
ఔర! భళీ! ఔరౌరా!        ||తరు||

నారీ మణి కోరిక    
ఒక సాకుగ గొని
పారిజాతము పాదపమున్
దేవేంద్రునితో పోరాడి మరీ
తెచ్చినావు ఈ ఇలాతలమునకు! ||తరు||
 
వంశీ కానల తిరిగేవు;
వెదురును వేణువు చేసేవు!
బొంగులు కర్రలు గీచుకునీ
గాయము లైతే ఎల్లారా?
నీకు గాయము లైతే ఎల్లారా? ||తరు||

మాధవీ లతల శయనింపు;
మల్లెల పొదల దోబూచీ!
మామిడాకుల బూరాలు
వినోదాలన్నీ బృందావనివి!
సరాగాలన్నీ ప్రకృతివి! ||తరు||

@@@@@@@@@@@@@@


taru saMpada aMTE , O swAmI!
nIkeMtaTi maruluu, mamakaaraM!
auara! BaLI! aurauraa!           ||taru||
  
naarI maNi kOrika    
oka saakuga goni
pArijAtamu pAdapamun
techchinaavu I ilaatalamunaku  ||

vaMSI kaanala tirigEvu;
vedurunu vENuvu chEsEvu!
boMgulu karralu gIchukunI
gaayamu laitE ellaaraa?
nIku gaayamu laitE ellaaraa? ||taru||

maadhavI latala SayaniMpu;
mallela podala dObUchI!
maamiDAkula bUraalu
vinOdaalannI bRMdaavanivi!
saraagaalannI prakRtivi! ||taru||

@@@@@@@@@@@@@@@@


అంతే నీకు చాలునా!?




వనమాలీ! నీ సిగ పూబంతిని;
శ్రీమంతిని భామిని, రాధికను!
        జ్యోత్స్నామయము భక్తుల మది ఇది;
        ఇది- ఎరుకయె, నీకు లోకవత్సలా!  ||జ్యోత్స్నా||

వట పత్రమ్ము - ఒక్కటి చాలా?
పండుకొనుటకు శేష శయనుడా!?
ఆది శేషునకు అలుక కలుగును              ||జ్యోత్స్నా||
 
తులసీ దళము ఒక్కటి చాలున?
నీదు బరువును తూచుటకు!
వలపు తారల చందురుడా!                    ||జ్యోత్స్నా||

@@@@@@@@@@@@@@@@@@@

                aMtE nIku chAlunaa!?


vaTa patrammu - okkaTi chaalaa?
paMDukonuTaku SEsha SayanuDA!?
aadi SEshunaku aluka kalugunu        ||

tulasI daLamu okkaTi chaaluna?
nIdu baruvunu tUchuTaku!
valapu taarala chaMduruDA!            ||


అత్తరు బొమ్మలు క్రిష్ణ లీలలు

















కనకాంబరునీ సన్నిధిలో;
ప్రతి లిప్తకు పరవశ,పుణ్యములే!;
అను క్షణమందును మోదముల;
లోకమ్మది – మది మందిరము;  ||

వట పత్రములను; డోలలుగా;          
గైకొని క్రిష్ణుని లుప్చల కేరింతాటలు;        
నటన నిధానము-నర్తన లీలలు
అత్తరు బొమ్మలు ఓ మనసా!  ||

అటు ఇటు కదలెడు-ముత్తెపు దండల
తూగే కాంతుల నవ రస; రచనల          
బృందావనమున బొండు మల్లియల
పరిమళ అలలే, ఓ మనసా! ||

@@@@@@@@@@@@@@@@@@

Saturday, June 11, 2011

సౌందర్య భావ-సుగుణాభిరాముడు


















పటుతర బంధముల ఉనికి
కిటు నిశ్చల చిత్రము;
పటిష్టముగ పరచు
కుటుంబములన్ ఆదర్శ సమాజము ||


(అను పల్లవి)
శ్రీ రామ చంద్రుడు- సుగుణాభిరాముడు
దాశరధీ నందనుడు-కౌసల్య తనూజుడు
మా కన్నుల నిలిచేను    ||

మణి కుండల శోభితుడు-లోకాభివంద్యుడు;
సాకేత సార్వభౌముడు-సౌందర్య భావమాతడే! ||

అవనిజ హృదయేశుడు-ఆంజనేయ పూజితుడు;
లక్ష్మణ ప్రియ సోదరుడు-లక్ష్య లక్షణము లితడే!||


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


paTutara baMdhamula uniki
kiTu niSchala chitramu;
paTishTa parachu -kuTuMbamulan
aadarSa samaajamu


(anu pallavi)
SrI raamachaMdruDu- suguNABiraamuDu
daaSaradhI naMdanuDu-kausalya tanUjuDu
maa kannula nilichEnu    ||

maNi kuMDala SOBituDu-lOkaaBivaMdyuDu;
saakEta saarvaBaumuDu-sauMdarya BAvamAtaDE! ||

avanija hRdayESuDu-aaMjanEya pUjituDu;
lakshmaNa priya sOdaruDu-lakshya lakshaNamitaDE!||

$$$$$$$$$$$$$$$$$$$$

జగముల కొలిచే చిట్టి చరణములు

















కాళీయుని పడగలపై- ఆటలేలనయ్యా?సయ్యాటలు చాలించు!
ఆ ఉదంతమంత తెలిసిన నీ రాధ గతిని తలిచినావా!?
బేల సంగతినీ తలిచినావ!?   ||

సత్యభామ వాలుజడలా? అవి - కాళీయము తోకలా?
నిత్యమిట్టి ఆటలైతే- రాధ డిల్ల వోవునురా! ||

ఇంతకింత నీ అల్లరి- గగనమంత కొలతలాయె;
సంత గోల వింతలౌర!- నీ చిట్టి పాదమ్ము  ములు;
ముజ్జగముల కొలిచేను ||

త్రిలోకములు నీ కాలి - కొనగోటిపైన నిలుపుకొన్నావని;
త్రివిక్రమావతారుడవని- మరుచునెపుడు రాధమ్మ!
భామ బీతి వినోదము! ఔరౌరా! నీకు కడు వినోదము! ||

@@@@@@@@@@@@@@@@@@@@@@@

        jagamula kolichE chiTTi charaNamulu


trilOkamulu nI kaali - konagOTipaina nilupukonnaavani;
trivikramaavataaruDavani- maruchunepuDu raadhamma!
bEla Baama bIti nIku vinOdamu! auruaraa! vinOdamu! ||

kaaLIyuni paDagalapai ATalElanayyaa?
aa udaMtamaMta telisina nI raadha  
gatini talichinaavaa!?
bEla సంగతిnii talichinaava!?   ||

satyaBAma vaalujaDalaa? avi - kaaLIyamu tOkalaa?
nityamiTTi ATalaitE- raadha Dilla vOvunuraa! ||
nI chiTTi paadammu
mujagamula kolichEnu ||

Friday, June 10, 2011

జుట్టుముడుల పందెములు వేసేను క్రిష్ణమూర్తి!


O peacock!playing with Sri Krishna
















ఎంతటి నెరజాణ నెమలి!?
అని పడతుల అచ్చెరువు!! ||

పారిజాత నీడలలో - ఆడే వన మయూరి;
పురి పింఛము లంచమిచ్చి- కన్నని దరి నిలిచేను;
మరి సిగ బంతి సరసన - సరసముగా నిలిచేను; ఔరా!
ఎంతటి నెరజాణ నెమలి!?
అని పడతుల అచ్చెరువు!! ||

కూరిమి సిగ పింఛములు/మ్ముల- తారాడు వన్నెలుగ
శ్రావణ మేఘాల సవ్వడులూ, హడావుడి
అన్నిటికీ జుట్టుముడుల పందెమ్ములు వేయును హరి!
ఎంత చిలిపి వాడమ్మా!
తెలిసిందా సరి!సరి!           | |

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;



eMtaTi nerajaaNa nemali!?
ani paDatala achcheruvu!! ||


paarijaata nIDalalO
ADu vana mayUri;
puri piMCamu laMchamichchi
kannani dari nilichEnu;
mari siga baMti sarasana
sarasamugaa nilichEnu; auraa!
eMtaTi nerajaaNa nemali!?
ani paDatala achcheruvu!! ||


kUrimi siga piMCamulu/mmula- taaraaDu vanneluga
SraavaNa mEGaala savvaDuluu, haDAvuDi
anniTikI juTTumuDula paMdemmulu vEyunu hari!
eMta chilipi vADammaa!
telisiMdaa sari!sari!               ||

@@@@@@


పద్మావతి జడ బిళ్ళలు





















పద్మనాభునీ మేనున; సురభిళ ముత్యమ్ములు,
అవి-పద్మావతి కనులురికిన ఆనంద బాష్పములు
          ......ఆనంద బాష్పములు!?  ||

నును కాంతిని కనుగొన్న
నెల వంక ఉరికినది;
ఇనుమిక్కిలి బింబమాయె
నామె జడల సిగ బిళ్ళగ ||

పోటీగా దుమికిన రవి
+బింబము సతి కేశమ్ముల
పున్నమి జాబిలికి జతగ;
చేరి గీర చూపించును ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

కోతి చేష్ఠలు - అనే నానుడి


















కోతీ! కోతీ!  కొమ్మచ్చీ! 
నీకూ పెడతా అప్పచ్చి!


కోతీ! కొమ్మల ఊగేవు
గొందుల, తూముల దూరేవు; 
వలేసి, పడితే గగ్గోలు!


తోకలు పట్టుకు లాక్కుంటే; 
మీ గుంపు ఆటలు భలే వినోదం! ;


పేలు తీయుటలో పై నేర్పరులంట!లు ; 
కోతి చేష్ఠలు - అనే నానుడి; 
మీ వలనే ఏర్పడెనౌరా! జగతిని!


అత్త కుండలను; నేలకు విసరీ, 
పుట్టింటి కడవలను నెత్తినెట్టుకొను; 
టక్కరి కోతీ! అమ్మ దొంగా!!!!!!


అలనాడు, 
సంద్రంపైన అంత సేతువును 
ఎలాగ కట్టీ, -
శ్రీ రాముల మెప్పును పొంద గలిగితివి?


కోతీ! కోతీ!  కొమ్మచ్చీ! 
నీకూ పెడతా అప్పచ్చి!


&&&&&&&&&&&&&&&&&&&&

Tuesday, June 7, 2011

ఖగ రాజు రెక్కలు స్వామికి ఛత్రములు





















తిరుమల శిఖరాల పైన;
 ప్రకృతి ఘన వ్రతమును
     సేయు వింత చూడుమా! చెలీ!
       కూర్మి చెలిమి కనుమా!   ||

రాయి రప్ప
తాళ వాద్య-రవములు పలికించును;
హాయి నింగి నీరదాల
ఘన మర్దళ ధ్వానమ్ములు||
     
నెమలి పురికి;
మకర తోర-ణముల తోడ  1
కూర్మి చెలిమి
గరుడుని సాచిన రెక్కలు
స్వామికి నిలిపిన గొడుగులు   ||

అచ్చు యంత్రంలో ప్ర ప్రథమ తెలుగు పుస్తకము



















మొట్ట మొదట 1807 లో ఆరంభమైనవి ఈ ప్రయత్నాలు,
తెలుగు- అచ్చు మూసలు  తయారు చేయుట.
పంచానన్, మనోహర్ లు మంచి మిత్రులు+బంధువులు,
మామా అల్లుళ్ళ చుట్టరికం కలిగి ఉన్న వాళ్ళు. బంధువులు, మామా అల్లుళ్ళ చుట్టరికం కలిగి ఉన్న వాళ్ళు.
ఇరువురూ కమ్మరి పని, లోహాలను అతికించుట, మలచుట మున్నగు పనులలో పనితనము కలిగిన  వారే!
విల్కిన్స్ అనే ఆంగ్లేయుని వద్ద- పంచానన్ ఎంతో intrest తో-పంచ్ కటింగ్ ను అభ్యసించాడు.
అలాగ ఆతను శిక్షణ పొందిన తర్వాత, pressలో పని దొరికింది.
ట్రైనింగు పిమ్మట, పంచానన్ కి ఉద్యోగంలో చేరాడు.
మిష్టర్ కేరీ-లండన్ మిషనరీ సొసైటీ మెంబర్.
కేరీ ఆధ్వర్యంలో నడిచే ముద్రణా శాల అది.
West Bengal (బెంగాల్ )లోని శ్రీరామ్ పూర్ లో , మద్రాస్ లలో
ఏక కాలాన ప్రింటింగు పనులు మొదలై,జరిగినవి.
1800-1804 ల మధ్య ఈ తెలుగు అచ్చు దిమ్మలను, ఆ మిత్ర ద్వయం తయారు చేసారు.
శ్రీశ్రీరామ్ పూర్ క్రిష్టియన్ మిషనరీల- అప్పటి ప్రకటన, చారిత్రక స్థానాన్ని పొందినది.
"బైబిల్ కథలు వివిధ భారతీయ భాషలలో అచ్చు ఐ అయి, విక్రయానికి సిద్ధంగా ఉన్నవి" అని ఆ అడ్వర్టైజ్ మెంట్ సారాంశము.
.[{Serampore (also called Serampur, Srirampur) is a city and a municipality in ... West Bengal is the third largest contributor to India's GDP and has the ......
The present Wesley Girls School with its missionary bungalow was purchased in 1884. ... Pratt arrived in 1880 and learnt to read Telugu Bible in six weeks }]
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
[J.Mangamma,
origin of Telugu printing- Studies in the Telugu Journalism - 1968 page 12]
@@@@@@@@@@@@@@@@@@@@@@
తెలుగు- అచ్చు మూసలు;
 [J.Mangamma, origin of Telugu printing- Studies in the Telugu Journalism -
1968 page 12]
@@@@@@@@@@@@@@@@@@@@@@@
260 పేజీ, తాపీ ధర్మారావుజీవితం-రచనలు -
రచన- ఏటుకూరి ప్రసాద్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 
ప్రచురణ; సెప్టెంబర్ 1989 ;                    ధర; rs 80/-