కనకాంబరునీ సన్నిధిలో;
ప్రతి లిప్తకు పరవశ,పుణ్యములే!;
అను క్షణమందును మోదముల;
లోకమ్మది – మది మందిరము; ||
వట పత్రములను; డోలలుగా;
గైకొని క్రిష్ణుని లుప్చల కేరింతాటలు;
నటన నిధానము-నర్తన లీలలు
అత్తరు బొమ్మలు ఓ మనసా! ||
అటు ఇటు కదలెడు-ముత్తెపు దండల
తూగే కాంతుల నవ రస; రచనల
బృందావనమున బొండు మల్లియల
పరిమళ అలలే, ఓ మనసా! ||
@@@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment