Monday, June 20, 2011

మువ్వన్నెల జెండాఅమ్మా! ఇవిగో, కనకాంబరములు!
అంబర సొగసులు ఈ పుష్పాలవి కదా!

అక్కా!అక్కా! ఇదిగో మల్లె!
నీ తెల్లని నవ్వుకు ప్రతిరూపం!

అన్నా! అన్నా! పూ బంతి!
బంతి ఆట నీకు గుర్తొస్తే ఎలా?

చెల్లీ! ఇదిగో చేమంతి!
పచ్చని మేలిమి వలువల రాణి!

నాన్నారూ! శివ లింగం పూవు!
దేవుని అర్చన చేద్దాము!

శాంతం, ధర్మం , క్రమ శిక్షణలకు
మీరే నిలిపే రత్నఛత్రము!
ఇదిగో! త్రివర్ణ పతాకము!

రెప రెప లాడును ఎల్లప్పుడునూ!
జెండావందనములు చేద్దాము!
జడలో, సిగలో, తోరణ పూవులు;
సెల్యూట్ చేతుల మన కేతనము!
         "జై హింద్! జై హింద్
                  జై హింద్! జై హింద్!"

*********************************

No comments:

Post a Comment