Sunday, June 12, 2011

హారతి! శుభ హారతి!


భక్తుల హృది ఊది వత్తు-
లింపారుగ ధూపములు;
మధు ధూపముల -
హారతీ! శుభ హారతీ!      ||హారతీ!||

మేఘాల - మబ్బుల అపరరంజీ
పళ్ళెరముల పూర్ణ జ్యోత్స్న ప్రమిదలు
దివ్య ప్రభలు శత కోటి     ||హారతీ!||

మా నేత్ర పుష్ప పరాగముల
అత్తరుల మృదు జల్లులు;
పరిమళ పన్నీరు శత కోటి  ||హారతీ!||

No comments:

Post a Comment