అఖిలవనిత !!!!
చిన్న హాస్యాలు,
వ్యాసాలు,
భక్తి గీతములు,లలిత గీతములు,
బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
Tuesday, June 14, 2011
ఆట కళలు 1,
అనాది కాలం నుండీ ప్రపంచములో ఆట పాటలు -
వాటితో పాటు లలిత కళలు క్రమక్రమంగా అభివృద్ధి గాంచాయి.
కొన్ని సార్లు కొన్ని మత సంస్థలు ఆయా దేశాళ్ల్లో నిషేదించేవి.
అయినా సరే!..... అ నిషేధాజ్ఞలు కొన్నాళ్ళ తర్వాత గాలిలో కలిసేవి.
ప్రజలు అలాంటి మూఢ విశ్వాసాలకు సంబంధించిన నిషేధ ఆజ్ఞ లను బేఖాతరు చేసేవారు.
మానసికోల్లాసానికి కళలు మూల స్తంభాలు అవడమే ఇందుకు ముఖ్య కారణం.
సంగీత, సాహిత్య, చిత్రలేఖన, శిల్ప కళాదులు
అన్నీ బహుముఖీనంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.
మరి ఆ కళలకు అనుబంధంగా -
ఆహార్యములూ, మేకప్పు, రంగస్థల అలంకరణలు,
పుస్తకములు, పైంటింగులూ, బ్రష్ లూ కుంచెలూ, ఇలాగ ........
అనేక సామగ్రి అవసరం ఔతూ వచ్చాయి.
ఆయా వస్తు సంబారాల తయారీ - కుటీర పరిశ్రమలుగానూ,
నేడు అవి- భారీ పరిశ్రమల స్థాయికి పెంపొందాయి.
తద్వారా లక్షలాదిమందికి జీవనోపాధి లభిస్తూన్నది.
ఆట వస్తువుల తయారీ కూడా ఈ కోవలోనిదే!
అన్ని దేశాలలోనూ బాల బాలికల కోసం-
పురాతన కాలం నుండీ-క్రీడా వస్తువులు అనేకములుగా ఉత్పత్తి ఔతూ వస్తూన్నాయి.
వివిధ దేశాలలోని ప్రాచీన ఆట, వినోద వస్తువులనూ, బొమ్మలనూ చూద్దామా!!!!!!!!
ఓరిగమీ కళ ప్రపంచవ్యాప్తంగా కళాభిమానులందరూ, నేర్చుకుని, చేస్తూన్నారు.
జపాన్ దేశంలో అనేక వేల సంవత్సరాల నుండీ ఈ ఒరుగమీ కళ వృద్ధి చెందింది.
origami toy కి మరో పేరు- jumping jackఅని కూడా ఉన్నది.
మరి మీరు కూడా అలాటి దానిని చూస్తారా? [ఆట కళలు-1]
No comments:
Post a Comment