Sunday, June 12, 2011

నవలాకుల పెదవుల పక పక నవ్వులు

































కన్నయ్యా! నీ మూలాన్నే
ఇన్ని ఇడుములు, ఇక్కట్లు/ట్లూ వేలాది!
మరి ఇబ్బందులు వేలాదిగా!
ఆది నారాయణ!
నమో నమ/మః! నమో నమ/మః  ||

కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                    ||

మన్నులు తిందువు పంకజ నేత్రుడ!
"నవనీతము తీయగ ఉన్నద"నీ
నవలాకుల పెదవుల పక పక-
నవ్వులు గ్రుమ్మరింతువు
కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                  ||


మా బుల్లి రాముడు-కడు బుద్ధిమంతుడని –
ఇపుడే ఇపుడే మా యశోద మాత
అందరితోనూ చెప్పినదయ్యా!/ ది;
తల్లి మాటను - వమ్ము సేయకుర!
కూడదయ్య మారాములు ;
చిన్ని క్రిష్ణ!రావోయీ!
ఇటు రా! రా! క్రిష్ణా!                 ||


No comments:

Post a Comment