ఖగ రాజు రెక్కలు స్వామికి ఛత్రములు
తిరుమల శిఖరాల పైన;
ప్రకృతి ఘన వ్రతమును
సేయు వింత చూడుమా! చెలీ!
కూర్మి చెలిమి కనుమా! ||
రాయి రప్ప
తాళ వాద్య-రవములు పలికించును;
హాయి నింగి నీరదాల
ఘన మర్దళ ధ్వానమ్ములు||
నెమలి పురికి;
మకర తోర-ణముల తోడ 1
కూర్మి చెలిమి
గరుడుని సాచిన రెక్కలు
స్వామికి నిలిపిన గొడుగులు ||
No comments:
Post a Comment