వనమాలీ! నీ సిగ పూబంతిని;
శ్రీమంతిని భామిని, రాధికను!
జ్యోత్స్నామయము భక్తుల మది ఇది;
ఇది- ఎరుకయె, నీకు లోకవత్సలా! ||జ్యోత్స్నా||
వట పత్రమ్ము - ఒక్కటి చాలా?
పండుకొనుటకు శేష శయనుడా!?
ఆది శేషునకు అలుక కలుగును ||జ్యోత్స్నా||
తులసీ దళము ఒక్కటి చాలున?
నీదు బరువును తూచుటకు!
వలపు తారల చందురుడా! ||జ్యోత్స్నా||
@@@@@@@@@@@@@@@@@@@
aMtE nIku chAlunaa!?
vaTa patrammu - okkaTi chaalaa?
paMDukonuTaku SEsha SayanuDA!?
aadi SEshunaku aluka kalugunu ||
tulasI daLamu okkaTi chaaluna?
nIdu baruvunu tUchuTaku!
valapu taarala chaMduruDA! ||
No comments:
Post a Comment