తరు సంపద అంటే, ఓ స్వామీ!
నీకెంతటి మరులూ, మమకారం!
ఔర! భళీ! ఔరౌరా! ||తరు||
నారీ మణి కోరిక
ఒక సాకుగ గొని
పారిజాతము పాదపమున్
దేవేంద్రునితో పోరాడి మరీ
తెచ్చినావు ఈ ఇలాతలమునకు! ||తరు||
వంశీ కానల తిరిగేవు;
వెదురును వేణువు చేసేవు!
బొంగులు కర్రలు గీచుకునీ
గాయము లైతే ఎల్లారా?
నీకు గాయము లైతే ఎల్లారా? ||తరు||
మాధవీ లతల శయనింపు;
మల్లెల పొదల దోబూచీ!
మామిడాకుల బూరాలు
వినోదాలన్నీ బృందావనివి!
సరాగాలన్నీ ప్రకృతివి! ||తరు||
@@@@@@@@@@@@@@
taru saMpada aMTE , O swAmI!
nIkeMtaTi maruluu, mamakaaraM!
auara! BaLI! aurauraa! ||taru||
naarI maNi kOrika
oka saakuga goni
pArijAtamu pAdapamun
techchinaavu I ilaatalamunaku ||
vaMSI kaanala tirigEvu;
vedurunu vENuvu chEsEvu!
boMgulu karralu gIchukunI
gaayamu laitE ellaaraa?
nIku gaayamu laitE ellaaraa? ||taru||
maadhavI latala SayaniMpu;
mallela podala dObUchI!
maamiDAkula bUraalu
vinOdaalannI bRMdaavanivi!
saraagaalannI prakRtivi! ||taru||
@@@@@@@@@@@@@@@@
No comments:
Post a Comment