Monday, June 13, 2011

ధారా శుద్ధిగ ఆశు కవిత్వము
















మింట ఇంటను ప్రతి ఒక్కరికీ-
ఈ దడబిడలెందుకనీ!?;
ఈ బిర బిర పరుగులు ఎందుకనీ!?;
హర్షాతిరేకతలు ఎందుకనీ!? ||

ధారా శుద్ధిగ చెప్పుచున్నవి;
ఉరుముల జయ జయ నాదాలు, నినాదాలు
గగన మహలులో నీరద రాసులు
భట్టు రాజులు ఐనాయి  ||

ఏక ధాటిగా మెరుపుల కృతులను
రాస్తూ ఉన్నవి వాన మొయిళులు;
ఆశు కవిత్వము ధారలుగా-
కురిపిస్తూండెను వరుణ దేవుడు       ||

పచ్చ దనమ్ముల-కజ్జలములను-
చేసుకున్నది వన దేవి;
పైరుల ఘంటము కదలికలో
క్రిష్ణ కావ్యము వెలసినది  ||

మింట ఇంటను ప్రతి ఒక్కరికీ-
ఈ దడబిడలెందుకనీ!?;
హర్షాతిరేకతలు ఎందుకనీ!? ||

కజ్జలము=సిరా మసి, ink

$$$$$$$$$$$$$$$$$$$$

dhaaraa Suddhiga cheppuchunnavi;
urumula jaya jaya naadalu, ninaadaalu
mabbulu BaTraajulu ainaayi, gagana mahalulO;
Eka dhaaTigaa merupula kRtulanu raastU unnavi vaana moyiLulu;
miMTa iMTanu prati okkarikii-
I daDabiDaleMdukanI!?;
harshaatirEkatalu eMdukanI!?
aaSu kavitvamu dhaaralugaa-
kuripistUMDenu varuNa dEvuDu       ||

pachcha danammula- siraalanu- chEsukunnadi vana dEvi;
pairula GaMTamu kadalikalO- krishNa kaavyamu velasinadi  ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No comments:

Post a Comment