Tuesday, July 13, 2010

ఓహో మేఘ మాలా!

















గగనాల తారాడు
వయ్యారి జల ధరమా!
సయ్యాటలను నీకు
నేర్పెదము రావమ్మ! ||

హిమ బిందు శత కోటి
మణి పూస లీయుమా!
సొగసైన హారాలు అల్లి
నీకిస్తాము ,బహుమతిగ ! ||

నీలాల నింగిలో సింహాసనమ్మీవు;
లాల పోయించుకుని,నవ్వు పసి పాపవీవు!
గల గలల వర్షాలు వసుధకు ఒసుగుమా!
మా బాలల బులిపాలు నీకు కానుకలమ్మ! ||

***************************************

Wednesday, July 7, 2010

కొంగు బంగారములు


















అమ్మ నిదుర లేపుతూంటె
బద్ధకముగ ఆవులిస్తూ,
మరల ‘బబ్బుని ‘ “ఊ”లు కొట్టేరు
చిన్నారి పిల్లలు
కాస్సేపు కునుకును తీయ తలిచేరు ||

తండ్రి గదమాయించగానే
నిదుర మత్తు ఎగిరి పోగా
బెడ్ నుండీ దూకి, బ్రష్షును
నోటిలోన పెట్టుకుంటూ
విద్యార్ధి బాలలు
నురుగు పొంగుల పళ్ళు తోమేరు ||

టిఫిను బుగ్గన కూరుకుంటూ
బుక్సు,నోట్సులు బ్యాగులోన
ఆదర బాదరా సర్దుకుంటూ
హడావుడిగా చిందులేస్తూ
స్టూడెంటు పిల్లలు
ఉరుకు పరుగుల స్టార్టు అయ్యేరు ||

మురిపాల చదువుల
ముద్దు బాల సందడులు సింగారం
నేటి బాలలు భావి పౌరులు
భరత మాత కొంగు బంగారం ||

Baala

కొంగు బంగారాలు ;

Jul 7 2010 6:12PM


koMgu baMgaaramulu
________________

amma nidura lEputUMTe
baddhakamuga aavulistuu,
marala ‘babbuni ‘ “U”lu koTTEru
chinnaari pillalu
kaassEpu kunukunu tIya talachEru .
“”
taMDri gadamaayiMchagaanE
nidura mattu egiri pOgaa
beD nuMDI duuki, brashshunu
nOTilOna peTTukuMTU
vidyaardhi baalalu
nurugu poMgula paLLu tOmEru ||

Tiphinu buggana kUrukuMTU
buksu,nOTsulu byaagulOna
aadara baadaraa sardukuMTU
haDAvuDigaa chiMdulEstU
vidyaardhi pillalu
uruku parugula sTArTu ayyEru
muripaala chaduvula
muddu baala saMdaDulu baMgaaraM .||


Monday, July 5, 2010

నదుల హారాలు


















మెరుపుల రెక్కలు కట్టి
మబ్బుల గుర్రాలొచ్చెను
చినుకుల బాలల్లారా!
చక చక ఇటు విచ్చేసి
సవ్వారీ చేయండి! ||

ఎండీ బీటలు వారిన
నెగుడుల, పగుళ్ళ నేలల
చిత్తడి ఒండ్రు మట్టి +
చెంగుల ఒత్తౌ మెత్తటి
పొత్తిళ్ళై మిమ్ములను
ఇంచక్కా పొదువు కొనును ||

చినుకు, చినుకూ చేరి
చిట్టి మడుగుల చేసి
ఏటి తరగల చెరిగి
వాగు వంకలు ఆయి
నదుల హారాలెన్నొ
ధరణికి సింగారాలు ||


Baala


By kadambari piduri,
Jul 4 2010 11:06PM

Sunday, July 4, 2010

తేనె కానుకలు


















మబ్బు జలదరించింది
పుడమి పులకరించింది
ఆమని తలవంచింది;
ఏమని తలచిందంటే –
“పైరు పాపలెంతొంతో
ముద్దు లొలుకుతున్నారని ||

ఏటిలోన నీటి జాలు
గల గల ప్రవహించినది
తొలకరి మాటలను "హొయలు"+
పాటలుగా మార్చేసి,
ఏరు వీణ అయ్యింది
తారంగం నేర్చింది ||

ఒడలు విరుచుకుని “ ప్రొద్దు”
మొద్దు నిదుర వదిలింది
వెలుగు రేక భాషలోన
సుప్రభాత గీతికను
తియ తీయగ పాడింది
తేనె కాను‌క లిచ్చినది ||


#Baala


By kadambari piduri,
Jul 3 2010 1:39AM

గాలి పడవలో సురభిళ పయనములు

















గులాబీలు, విరుల దళ మంజరీ ఛాయలలో
పరిమళ సంఘమ్ములు సుంత విశ్రాంతి గైకొనుచున్నవి;

సువిశాల నీలాంబర మాత
“విలాస యానమ్ములు సేయుడనుచు”
వాయు నావలను సతతమ్ము అందు బాటులో ఉంచి,
సౌరభ సుతులకు ఆనతి నిచ్చెను - సురుచిర దర హాసినియై;

పచ్చి కలి కాలమ్మిది! పెట్రోలు, మురుగు,
దుర్వాసనల కాలుష్య బీభత్సమ్ముల
సాగు చున్నది నేడు -మానవాళి మనుగడ!

సౌరభ సముచ్చయమ్ములార!
సరగున విచ్చేయండీ ఇలా తలమ్ములకు!
ఎల్ల జాగాలందు విస్తరించండి!
హరిత వన సౌందర్యాభిలాషా రాగమ్ములను
మానవ హృదయాలలోన పల్లవింప జేయండి

ఆహ్లాద తెరలు గగన పర్యంతమ్ము పరి వ్యాప్తి చెంద
భూగోళమ్మును పచ్చ దనముల పూల సజ్జగా ఒనరించ
నేడు - ఈ జనావళి ప్రతిన బూనును లెండు!

పరిమళమ్ములార! భావ మోదమ్ములార!
మీకివే మాదు సుస్వాగతములు!
మీ రాక వలననె - ప్రజల మానసములు
ఉల్లాస పుష్పములుగా విరియ బూయును
కాన ,
మాదు విన్నపముల మన్నించి, రా రండు!!!!!

జలపాతాల నెమలి కన్నులు





















పికిలి పిట్ట, పాల పిట్ట
మా తోటి రండోయీ !
చక్కనైన ప్రకృతీ
అందాలను చూపిస్తా! ||

కొండ, గిరులు
అవి – పుడమి తల్లి కిరీటాలు;
ఆ జారే జలపాతాల్
అందు – అమరించిన నెమలీకలు ||

గాలి వాటు ప్రయాణాలు
సుతారంగ సాగేను
పైరు పల్లె వాటులన్ని
నవ్య నర్తనములాడును ||

తరులు, విరులు, పచ్చాకులు
నాట్య క్రీడ విలాసాల
తిలకించే రస హృదయములు
పునీతమౌ నయనములు ||

Baala


By kadambari piduri,
Jun 18 2010 7:19AM

చందనాల పూజలు

















చెలులారా! చేర రండి మధురా పురిని
జిలుగంచుల పావడాలు రెప రెప లాడ
మధు సూదను గుడి కెళదాము ||

హరి చందనాలు చెంగలువ రేకులలమి
పొందుగా;స్వామి చెక్కిళ్ళ చేరి ,
మోమునందు కొనేనొహో! ఏమి తపము చేసెనో!?!
ఇందు వదను ఉరమున చేరేను ||

నీ నాట్య వినోదము సందడిలో
స్వర్ణ మంజీరము రవళులు ఊగంగా
మా వందన శతముల నందుకోవయా
స్వామి! చెంగల్వ రాయడా! |

Kovela


By kadambari piduri, May 3 2010 10:18PM

Wednesday, June 30, 2010

జార్జి హార్రిసన్ శ్రీ కృష్ణ భక్తి గీతము ;






















పాశ్చాత్యులు అనేక మంది,"హరే క్రిష్ణ" భక్తి ఉద్యమముతో ప్రభావితులై ,
తమ జీవిత విలువలను ఉన్నత స్థాయిలో మలుచుకున్నారు.
"జార్జి హార్రిసన్ వెస్టర్న్ మ్యూజిక్ లో నిష్ణాతుడు.
" శ్రీ కృష్ణుని" కీర్తిస్తూ, తానే స్వయంగా రాసి, ఆలపించిన గీతం ఇది.
ఈ ఇంగ్లీషు పాటను చూడండి.


LYRICS ;
________

"MY SWEET LORD" -
________________
( BY GEORGE HARRISON ;)
________________________

















My sweet lord
Hm, my lord
Hm, my lord!

I really want to see you
Really want to be with you
Really want to see you lord
But it takes so long, my lord !

My sweet lord
Hm, my lord
Hm, my lord!

I really want to know you
Really want to go with you
Really want to show you lord
That it won't take long,

my lord (hallelujah)
My sweet lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My sweet lord (hallelujah)

I really want to see you
Really want to see you
Really want to see you, lord
Really want to see you, lord
But it takes so long, my lord (hallelujah)

My sweet lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My, my, my lord (hallelujah)

I really want to know you (hallelujah)
Really want to go with you (hallelujah)
Really want to show you lord (aaah)
That it won't take long, my lord (hallelujah)
Hmm (hallelujah)

My sweet lord (hallelujah)
My, my, lord (hallelujah)
Hm, my lord (hare krishna)
My, my, my lord (hare krishna)
Oh hm, my sweet lord (krishna, krishna)
Oh-uuh-uh (hare hare)

Now, I really want to see you (hare rama)
Really want to be with you (hare rama)
Really want to see you lord (aaah)
But it takes so long, my lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My, my, my lord (hare krishna)
My sweet lord (hare krishna)
My sweet lord (krishna krishna)
My lord (hare hare)
Hm, hm (Gurur Brahma)
Hm, hm (Gurur Vishnu)
Hm, hm (Gurur Devo)
Hm, hm (Maheshwara)
My sweet lord (Gurur Sakshaat)
My sweet lord (Parabrahma)
My, my, my lord (Tasmayi Shree)
My, my, my, my lord (Guruve Namah)
My sweet lord (Hare Rama)

[fade:]
(hare krishna)
My sweet lord (hare krishna)
My sweet lord (krishna krishna)
My lord (hare hare)

Saturday, June 26, 2010

అత్తరు వర్షం

















పురి విప్పార్చిన నెమలి పింఛములా
అవిగో! అవిగో! కారు మబ్బులు;
ఆత పత్రము =umbrellaa
తీసుకు రండి తొందరగా!

చండా మొండీ వర్షం వచ్చెను
పడిసం పట్టును ; జలుబూ చేయును
ఆరోగ్యమే సౌభాగ్యము కద!
రెయిన్ కోటులను ధరియించండీ!

( పిల్లలు) :::

ఓహో వర్షం, ఆహా! హర్షం!
వాన జల్లుల అత్తరు, పన్నీర్లు
వాన బాలకు కేరింతలమై
తడిసి, తనియుతాం, ఆటలాడుతాం!!!
Baala


By kadambari piduri ;
May 28 2010

Thursday, June 3, 2010

నీలముపై పగడం

















మౌళి పింఛము వాని పెదవుల
భావగర్భిత మంద హాసము
ఇంద్రనీలము మేని ఛాయల
ఒదిగినట్టి పగడ మెవరే???
ఆ మణి ప్రవాళ మెవరే?? ||

(చెలులు):::

“ ఇంకెవ్వరమ్మా! రాధిక !
మన రాధిక! " ||

ప్రణయ దృక్కులు జతలు జతలుగ
అల్లుకున్న తోరణమ్ములు
కెంపు, నీలము కన్నయ్య, రాధిక
ఇంపు పెంపుల రాగ మాలిక ||

కళా సీమలకీ జోడీ
సరిగ పోగుల చాందినీ
సకల హర్షామోద ద్యుతి తతి
స్వర్ణ కానుకలీ పుడమి తల్లికి ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&




By kadambari piduri, May 28 2010 8:40PM

ప్రకృతి భక్తి





















సంపెంగలు, పున్నాగ పూలు
చేమంతీ, గులాబీలు
కనకాంబర, మల్లియలు
మొగలి, దవన, మరువములు
అన్ని తపస్సు చేసాయి
దేవుడు వరముల నిచ్చెను;

గాలి పట్టు తివాచీని
పొందినవీ సంబరముగ;
ఆ మాయ జంబుఖాణ పైన
సరగున పూ సుగంధాలు
బాలలందరిని చేరి
చెమ్మ చెక్క లాడాయి;

బాల ప్రపంచములో పువులు
ఎన్నెన్నో నేర్చాయి; అవి -
తమ వన్నెల తావులకు
మెరుగులను దిద్దు కొనెను

మోదములకు మారు పేరు
కేరింతల చిన్నారులు
అందులకే ప్రకృతి ఇట
భక్త పరమాణువు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&

Baala


By kadambari piduri,
May 28 2010 8:34PM

Monday, May 31, 2010

కళ్యాణ తిలకము పల్యంకిక ;


















శుభ సూచక శకునములు
వసుధ ఎల్ల శోభిల్లెను
వధువు పద్మావతికి సరి జోడీ
మధు సూదన, శ్రీనివాసుడోయమ్మా! ||

కను బొమ్మల పై వరుసగ
మెరిసే తళుకుల్లు
పల్లకి గీతల కుంకుమ
కళ్యాణం బొట్టు ||

చెక్కిళ్ళ పసిడి రజనులు
చిరు – చెమటల చుక్కల్ల తడిసి
నింగి చుక్కలను మించి
మురిపెంపు పెంపు మిల మిలలు ||

ఎడమ చెంప దిష్టి చుక్క;
నాగ సరము, వంకీలు
కొప్పు చుట్టు రవల నగల
కాంతి ప్రదక్షిణములు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


kaLyaaNa tilakamu palyaMkika ;
__________________________

SuBa suuchaka Sakunamulu
vasudha ella SOBillenu
vadhuvu padmaavatiki sari jODI
madhu sUdana, SrInivaasuDOyammaa! ||

kanu bommala pai varusaga
merisE taLukullu
pallaki giitala kuMkuma
kaLyANaM boTTu ||

chekkiLLa pasiDi rajanulu
chiru – chemaTala chukkalla taDisi
niMgi chukkalanu miMchi
muripeMpu peMpu mila milalu ||

eDama cheMpa dishTi chukka;
naaga saramu, vaMkIlu
koppu chuTTu ravala nagala
kaaMti pradakshiNamulu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
( vagdevi kadambari )