Thursday, June 3, 2010

ప్రకృతి భక్తి





















సంపెంగలు, పున్నాగ పూలు
చేమంతీ, గులాబీలు
కనకాంబర, మల్లియలు
మొగలి, దవన, మరువములు
అన్ని తపస్సు చేసాయి
దేవుడు వరముల నిచ్చెను;

గాలి పట్టు తివాచీని
పొందినవీ సంబరముగ;
ఆ మాయ జంబుఖాణ పైన
సరగున పూ సుగంధాలు
బాలలందరిని చేరి
చెమ్మ చెక్క లాడాయి;

బాల ప్రపంచములో పువులు
ఎన్నెన్నో నేర్చాయి; అవి -
తమ వన్నెల తావులకు
మెరుగులను దిద్దు కొనెను

మోదములకు మారు పేరు
కేరింతల చిన్నారులు
అందులకే ప్రకృతి ఇట
భక్త పరమాణువు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&

Baala


By kadambari piduri,
May 28 2010 8:34PM

No comments:

Post a Comment