Monday, May 31, 2010

కళ్యాణ తిలకము పల్యంకిక ;


















శుభ సూచక శకునములు
వసుధ ఎల్ల శోభిల్లెను
వధువు పద్మావతికి సరి జోడీ
మధు సూదన, శ్రీనివాసుడోయమ్మా! ||

కను బొమ్మల పై వరుసగ
మెరిసే తళుకుల్లు
పల్లకి గీతల కుంకుమ
కళ్యాణం బొట్టు ||

చెక్కిళ్ళ పసిడి రజనులు
చిరు – చెమటల చుక్కల్ల తడిసి
నింగి చుక్కలను మించి
మురిపెంపు పెంపు మిల మిలలు ||

ఎడమ చెంప దిష్టి చుక్క;
నాగ సరము, వంకీలు
కొప్పు చుట్టు రవల నగల
కాంతి ప్రదక్షిణములు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


kaLyaaNa tilakamu palyaMkika ;
__________________________

SuBa suuchaka Sakunamulu
vasudha ella SOBillenu
vadhuvu padmaavatiki sari jODI
madhu sUdana, SrInivaasuDOyammaa! ||

kanu bommala pai varusaga
merisE taLukullu
pallaki giitala kuMkuma
kaLyANaM boTTu ||

chekkiLLa pasiDi rajanulu
chiru – chemaTala chukkalla taDisi
niMgi chukkalanu miMchi
muripeMpu peMpu mila milalu ||

eDama cheMpa dishTi chukka;
naaga saramu, vaMkIlu
koppu chuTTu ravala nagala
kaaMti pradakshiNamulu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
( vagdevi kadambari )

No comments:

Post a Comment