వనితా మణి కరములందు
అరుణోద్యానాలు వెలసె ;
ఎటుల? ఎటుల!? : ||
;
కురువకం, గోరింట మోజు తీర ;
నారీ మణి అర చేతులందు ;
పంటలయీ పండినవి ;
గోరింటల ఎరుపులుగా పూసినవి,
విరబూసినవి ; ||
;
నవ రత్న ప్రభల కాంతులన్ని ;
నేడు కాందిశీకులైనవి ;
పడతి రాధ దరహాస శోభల ;
అభయములు పొందినవి ;
ఆశ్రయాలు పొందినవి ; ||
;
ఇన్నిన్ని సొబగుల కలిమిలను కలబోసుకొని ;
కోమలి రాధికతో నిన్ను చేరినాయి ;
అవి అన్ని నిన్ను చేరినాయి ;
నీ ఆరాధనయే వానికి పరమావధి కద ; క్రిష్ణా! : ||
;
- రాధా మనోహర ;
అరుణోద్యానాలు వెలసె ;
ఎటుల? ఎటుల!? : ||
;
కురువకం, గోరింట మోజు తీర ;
నారీ మణి అర చేతులందు ;
పంటలయీ పండినవి ;
గోరింటల ఎరుపులుగా పూసినవి,
విరబూసినవి ; ||
;
నవ రత్న ప్రభల కాంతులన్ని ;
నేడు కాందిశీకులైనవి ;
పడతి రాధ దరహాస శోభల ;
అభయములు పొందినవి ;
ఆశ్రయాలు పొందినవి ; ||
;
ఇన్నిన్ని సొబగుల కలిమిలను కలబోసుకొని ;
కోమలి రాధికతో నిన్ను చేరినాయి ;
అవి అన్ని నిన్ను చేరినాయి ;
నీ ఆరాధనయే వానికి పరమావధి కద ; క్రిష్ణా! : ||
;
- రాధా మనోహర ;