Showing posts with label శ్రీనివాస పద్మావతి లక్ష్మి. Show all posts
Showing posts with label శ్రీనివాస పద్మావతి లక్ష్మి. Show all posts

Tuesday, October 2, 2018

శ్రీరంగనాధునికి నిత్య వైభోగమే

వైభవమే ఇది - శ్రీరంగశాయికి ;
నిత్య వైభోగమే, అంగ రంగ వైభోగమే ;
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; || 
;
అంగనామణులెల్ల వైభవముగాను ;
అంగ రంగ వైభవమ్ముగాను ;
రంగారుబంగారు చందనాల ; 
లేపనములను రంగరంచి ; 
మేనెల్ల నిలువెల్ల పూయండి చనువార ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
మైపూత పూయండి, ఓ లలనలారా ;
లేపనము లలమండి, చెలులార - చెలువముగా -
దండిగా మెండుగా, అలదండి - చెలులార ;
సౌగంధ కస్తూరికా లేపనములను ; 
స్వామివారికి అలదండి ప్రేమ మీర ; 
రంగనాధునికి ; 
మన శ్రీరంగనాధునికి ; ||
;
చెన్నకేశవుని మేన, చెలువార, చనువు మీర ;
పరిమళం వ్యాపింప, పునుగు, జవ్వదులు ; 
చిత్రములు వేసేను - చిత్రాలు చేసేను ;
పూయండి - తనివార చెలులార, ఓ వనితలారా ;
రంగనాధునికి, మన శ్రీరంగనాధునికి ; ||
;
==================; ;
;
waibhawamE idi - SreeramgaSAyiki ;
nitya waibhOgamE, amga ramga waibhOgamE ;  ||
;
amganaamaNulella waibhawamugaanu ;
amga ramga waibhawamugaanu ;
ramgaaru bamgaaru camdanaala ; 
lEpanamulanu ramgarimci ;
mEnella puuyamDi, O lalanalaara ; 
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
maipuuta puuyamDi, O lalanalaara ; 
lEpanamu lalamamDi,  celulaara celuwamuga ;
damDigaa memDugaa - aladamDi celulaara ;
saugamdha kastuurikaa lEpanamu lalamamDi ;
swaamiwaariki aladamDi prEma meera ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||
;
cennakESawuni mEna - celulaara celuwamuga ;
parimaLam wyaapimpa, punugu, jawwadulu ; 
citramulu wEsEnu - citraalu cEsEnu ; 
puuyamDi taniwaara, O wanitalaara ;
ramganaadhuniki, mana Sreeramganaadhuniki ;  ||

Thursday, February 9, 2017

శ్రీరామ చిలుక , parrot

నిత్యకళ్యాణము పచ్చతోరణములు ;
పెళ్ళిబాజాల సందడితో
శ్రీరంగనాధ స్వామివారి కోవెలలో ;
నిత్యకళ్యాణము పచ్చనీ తోరణములు ; ||

రంగయ్యకు రహస్యాలు నుడివెను శ్రీరామ చిలుక 
కీరవాణి ఊసులేవొ భలేగా అందినవి ;
భలే భలేగా అందినవి ; ||

ఎటు నుండి వచ్చినదో విల్లిపుత్తూరుకి 
ఈ చిలుక, ముద్దు ముద్దు రా చిలక ;
బేల గోదాదేవి గృహమునే చేరినది ; ||

కావేరీ భాగ్యమిది ;
కాదేదీ ఇట మొద్దు ;
పక్షికినీ చతురతలు ; ||

జ్ఞానమబ్బు పిట్టలకు
బుల్లి పిట్టలకున్ను ;
మబ్బు వన్నె రంగనాధు
నిట్టె ఒప్పించినదీ రామ చిలుక ;
పెళ్ళిబాజాల సందడితో
నిత్యకళ్యాణము పచ్చతోరణములు ;
శ్రీరంగనాధ స్వామివారి కోవెలలో ; ||
;
రాధా మనోహర ;

Friday, February 3, 2017

రమ్య జామాతృ ముని

"శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము" ,"శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్"లు సుప్రసిద్ధమైనవి. 
భక్త కోటి హృదయములను పులకింప జేసే మాధుర్య శ్లోక గుచ్ఛములు ఇవి. 
శ్రీ వేంకటేశ పుణ్య శ్లోకములను రచించుటచే పునీతుడైన మహనీయుని పేరు తెలుసా?
ఆ భక్త వరేణ్యుని నామ ధేయం "రమ్య జామాతృ ముని" 
శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ 
"శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ " అనే మొదటి శ్లోకముతో ప్రారంభమౌతున్నది.
"శ్రీ మత్సుందర జామాతృ ముని మానస వాసినే 
సర్వ లోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ."
అని, రచయిత 'జామాతృ ముని' నామ ధేయం ప్రస్తావన ఉన్నది.

************************************:

శ్రీనివాస పద్మావతి లక్ష్మి ;- label ; 
Bakti Kusumaalu     ;   2 ఫిబ్రవరి 11:09 AMకి · &
రమ్య జామాతృ ముని ;- & 14, మే 2009, గురువారం ; కోణమానిని blg 
కోణమానిని [ link ] 

మంగమ్మ చూపులే రంగారు బంగారు

హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
వలయాలు,వలయాలుగా, వెలయు చున్నాయి ;
తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ; 
మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ;  || 

ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
సతి వాలు చూపుల సొంపారు ముగ్గులే ;
ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ;  ||

కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
ఈ ముగ్గుల "లో గుట్టు"- తన మనసులో "గుట్టు" ;
అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి! ;  || 
;
& 25, జనవరి 2009, ఆదివారం ; శ్రీ వేంకటేశుడు ,కోవెల (కసం) ;- 
కోణమానిని blg

Thursday, August 4, 2016

ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్?

ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్?
(answer):::
ఘీంకరిస్తూ అడవికి పోతా!
(ప్రశ్న) :::
అడవికి పోయి అటేమి చేస్తావ్?
( answer ):::
పద్మావతినీ భయ పెడతాను
అయ్యవారిని చేరును అమ్మ! 
శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి
సాష్టాంగం!దండ ప్రణామం!

అమ్మకు,అయ్యకు కళ్యాణం
అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా!
నా వీపు పైన అంబారి కట్టి
వధూ వరులను కూర్చుండ బెట్టి
ఊరేగిస్తా ముల్లోకములు. 
;
*************************;
; konamanini.blog 12, మే 2009, మంగళవారం ;- = "పెళ్ళిపెద్ద"