Saturday, February 4, 2017

ప్రకృతి

దోబూచాటల, దాగుడుమూతలు ;

గెలుపు ఎప్పుడూ క్రిష్ణుని సొంతం! ;  || 

వ్రజబాలునికే సహకరించును ;  ప్రకృతి అంతా! ; 
ఇది ఎంత వింతయో ఓ సఖియా! :  || 

దోబూచాడెడి నీలవర్ణుని ; 
  దివి, నీలిమబ్బుల నీడలు క్రమ్మును :  || 

ఈదులాడెడి లీలా కృష్ణుని ; 
  అట, కాళిందీ సతి కుబుసము కప్పును :  || 

భ్రమర కీటక న్యాయము కోరుచు ; 
  ఆ నల్ల కలువకై వెదికాను, వేసారాను  :  ||  ===========================; 
;          prakRti 
dObuuchATala, daaguDumuutalu ;
gelupu epppuDU krishNuni somtam! ;  || 

wrajabaalunikE sahakarimchunu ;  
prakRti amtA! ; idi emta wimtayO O saKiyA! :  || 

dObuuchADeDi neelawarNuni ; 
diwi, neelimabbula neeDalu krammunu :  || 

iidulADeDi leelaa kRshNuni ; 
aTa, kaaLimdI sati kubusamu kappunu :  || 

bhramara keeTaka nyaayamu kOruchu ; 
aa nalla kaluwakai wedikaanu, wEsaaraanu :  || 

పేజీ 140 - శ్రీకృష్ణగీతాలు     

No comments:

Post a Comment