Monday, February 13, 2017

భోగి, కనుమల జత సంక్రాంతి

 మొదటిసారి పువ్వో, పువ్వో; 
         నవ్వింది చూడవోయి - 
       అది కాస్త తోటలోని నువ్వో నువ్వో!? || 
1. పువ్వులోని నవ్వులన్ని 
    గువ్వా! గువ్వా! విరబూసి ; 
     నింగి కెగసె అవ్వాయ్ చువ్వల్లాగా ||  
2. మాట కాస్తా పాట అయ్యీ , హాయ్ రే, హాయిరే ;; 
    ఆట లన్నీ - పాటలయ్యీ లెస్సగ హైలెస్సా!   ||  
3. ఆట పాటల తోటీ రంగరించి ; 
    వన్నెచిన్నె రంగులెన్నొ గుమ్మరించి ;
    ముంగిలిలొ ముగ్గులుగ వెలసెనమ్మా!  || 
4. లాస్య కళ మేళనాల రంగేళీలు ; 
     ముద్దుగుమ్మ లందరున్ను ; 
      చేరి పెట్టు గొబ్బి పూలు ; ;
       గొబ్బెమ్మలుంచిన కోలం వల్లీలు ; 
        కోలాహలాల పొంగల్ పర్వం ;  ||  
5. లక్ష్మీ కళలు ఉప్పొంగు ప్రతి గుమ్మమున ; 
     ఆకాశ గుమ్మటముల వెలుగుల వరముల ; 
      భోగి, కనుమల జత కట్టి  సంక్రాంతి ;
         విచ్చేసే వేడుకలు మన కొరకు ;  || 

-----------==============;  
paaTa ;- 

modaTisaari puwwO, puwwO; 
nawwimdi chUDawOyi - 
adi kaasta tOTalOni nuwwO nuwwO!? ||
 
puwwulOni nawwulanni guwwaa! guwwaa! wirabuusi ; 
nimgi kegase awwaay chuwwallaagaa ||  

maaTa kaastaa pATa ayyii , haay rE, haayirE ;; 
aaTa lannii - pATalayyii lessaga hailessaa!   ||  

ATa pATala tOTI ramgarimchi ; 
wannechinne ramgulenno gummarimchi ;  
mumgililo mugguluga welasenammaa!  || 

laasya kaLa mELanaala ramgELIlu ; 
muddugumma lamdarunnu ; 
chEri peTTu gobbi puulu ; ; 
gobbemma lumchina kOlam walliilu ; 
kOlaahalaala pomgal parwam ;  ||  

lakshmee kaLalu uppomgu prati gummamuna ; 
aakaaSa gummaTamula welugula waramula ; 
bhOgi, kanumala jata kaTTi  samkraamti ;
wichchEsE wEDukalu mana koraku ;  || 
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
హర్రీఅమూల్! హర్రీహర్రీ! 1969 లో "హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం" ;-
 తెలుగు రత్న మాలిక ;;- 
▼  2017 (3) ;- ▼  February (3) ;-  టక టక టక టక ; గిబ్బెరిష్ లాంగ్వేజ్ - తికమకగా ;
హర్రీఅమూల్! హర్రీహర్రీ! ; 

No comments:

Post a Comment